Breaking News

అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం అండ… : ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు

నూజివీడు, ఆగష్టు, 25:
అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచిందని శాసన సభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జరిగిన నూజివీడు నియోజకవర్గంలోని నూజివీడు, ఆగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు, నూజివీడు(మున్సిపాలిటీ) లలో అగ్రిగోల్డ్ బాధితులు 8205 మందికి నగదు జమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నట్లు తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులు నూజివీడు మండలంలో 1339 మంది, మాజివీడు(మున్సిపాలిటీ) 1404 మంది, ఆగిరిపల్లి మండలంలో 2297 మంది ముసునూరు మండలంలో 1683 మంది, చాట్రాయి మండలంలో 1482 మందికి వారి వారి ఖాతాల్లో నగదు జమచేయడం జరిగిందన్నారు. ఒక ప్రైవేట్ సంస్థ బాధితులకు న్యాయం చేసిన దాఖలాలు దేశంలోనే ఎక్కాడా లేవని ఇచ్చిన హామీని నేరవేర్చి ఆదుకున్న ఏకైకవ్యక్తి యువ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని శాసనసభ్యులు వివరించారు. ముఖ్యమంత్రి తన పాదయాత్రలో అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీ ప్రకారం 20 వేలు లోపు ఉన్న బాధితుల ఖాతాలో నగదు జమచేసి వారి ముఖాల్లో ఆనందం నింపారన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల్లో ఎక్కువగా కూలీనాలీ చేసుకొనేవారనీ, రెక్కాడితేగానీ డొక్కాడని చిరువ్యాపారులు ఉన్నారని వీరందరికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. అనంతరం అగ్రిగోల్డ్ బాధితులకు వారిఖాతాల్లో నగదు జమచేసిన సందర్భంగా కృతజ్ఞతగా ముఖ్యమంత్రి ఫోటోకి శాసన సభ్యులతోపాటు బాధితులు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో నూజివీడు యంపిడివో జి, రాణి, ముసునూరు యంపిడివో బి.వి. సత్యనారాయణ, ఆగిరిపల్లి యంపిడివో పి. భార్గవి, మున్సిపల్ కమీషనరు సయ్యద్ అబ్దుల్ రషీద్, మున్సిపల్ చైర్ పర్సన్ రామిశెట్టి త్రివేణిదుర్గ, మున్సిపల్ వైన్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, కౌన్సిలరు శీలం రాము, పట్టణ ప్రముఖులు రామస్వామి, నాలుగు మండల నుండి వచ్చిన అగ్రిగోల్డ్ బాధితులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కి కృతజ్ఞతలు

-ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్  అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *