Breaking News

రెండవ విడతలో లబ్దిదారులకు అందించే వైఎస్సార్ జగనన్న ఇళ్ల స్థలాలకు భూసేకరణ వేగవంతం చెయ్యాలి…

-పాఠశాల విద్యార్ధులతో కలసి భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేసిన సబ్ కలెక్టరు…
-సబ్ కలెక్టరు జి. సూర్య సాయి ప్రవీణ్ చంద్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైస్సార్ జగనన్న ఇంటి స్థలాల కు భూసేకరణ వేగవంతం చెయ్యాలని సబ్ కలెక్టరు జి. సూర్య సాయి ప్రవీణ్ చంద్ అన్నారు. బుధవారం సబ్ కలెక్టరు సూర్య సాయి ప్రవీణ్ చంద్ తాహశల్థారు, యంపీడీవోలతో కలసి జగనన్న ఇళ్ల స్థలాలల భూసేకరణ నిమిత్తం భూములను పరిశీలించారు. ఈ సందర్బంగా సబ్ కలెక్టరు మాట్లాడుతూ లబ్దిదారులకు రెండవ విడత ఇళ్ల స్థలాలు అందించే ప్రక్రియలో భాగంగా విజయవాడ డివిజన్ లోని తోటరావులపాడు, వెలది కొత్తపాలె, చందర్లపాడు గ్రామాల్లోని భూములను అనువుగా ఉన్నదీ లేనిదీ పరిశీలించడం జరిగిందన్నారు. ఈ సందర్బంగా సబ్ కలెక్టరు చింతలపాడు ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి ఆరోగ్య కేంద్రం ద్వారా రోగులకు అందిస్తున్న వైద్య సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెలదికొత్తపాలెంలో గల పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలసి నేలపై కూర్చోని భోజనం చేసి మద్యాహ్నం భోజనం యొక్క నాణ్యాతా ప్రమాణాలను గుర్తించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం సబ్ కలెక్టరు తహశీల్దారు , యంపీడీవో కార్యాలయాలతో పాటు పోలీస్ స్టేషన్ల ను సందర్శించి ఉద్యోగులు నిర్వహిస్తున్నా రిజిష్టర్లు, రికార్డులు నిర్వహణ తీరును పరిశీలించారు. అనంతరం కార్యాలయము లోని అన్ని గదులు పరిశీలించి చేపట్టాల్సిన మార్పులను సూచించడం జరిగిందన్నారు. సబ్ కలెక్టర్ వెంట తహశీల్దారుజె. సుశీలాదేవి, యంపీడీవో సిహెచ్ శ్రీనివాసరావు, ఎహెచ్ ఏసోబు, సర్వేర్లు, ఆర్ఐలు, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *