-అక్టోబర్ 2 నాటికి 75 శాతం పనులు పూర్తిచేయాలి
-రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)
-అధికారులు సమన్యయంతో గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు సహాకారంతో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చెయ్యాలి…
-ఇళ్ల నిర్మాణాలకు సిమ్మెంట్, స్టీల్, ఇసుక కొరత లేదు…
-ఇంకా ప్రారంభించని సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్ లు వెంటనే ప్రారంభించాలి…
-ప్రతి కాంట్రాక్టరు వంద ఇల్లను నిర్మించే విదంగా అధికారులు చర్యలు చేపట్టాలి…
-కలెక్టరు జె.నివాస్
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని రైతులు, అన్నివర్గాల ప్రజలకు మెరుగైన సేవలందించే వ్యవస్థను సీఎం జగన్మోహనరెడ్డి నిర్మిస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. శుక్రవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో గుడివాడ నియోజకవర్గంలో హౌసింగ్, రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్ లు, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ల పురోగతిపై మంత్రి కొడాలి నాని సమీక్షించారు. ఈ సందర్భంగా గుడివాడ రూరల్, గుడ్లవల్లేరు, నందివాడ మండలాల తహసీల్దార్లు, ఎండీవోలు, హౌసింగ్ ఉద్యోగులతో వేర్వేరుగా మాట్లాడారు. కాంట్రాక్టర్లు కూడా సుముఖంగానే ఉన్నారని, ఎటువంటి సాకులు చెప్పకుండా వచ్చే అక్టోబర్ 2 వ తేదీ నాటికి 75 శాతం పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. గుడివాడ నియోజకవర్గంలో సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు 38 ఉన్నాయని చెప్పారు. 27 వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లు మంజూరయ్యాయన్నారు. 16 రైతుభరోసా కేంద్రాలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. తొమ్మిది సచివాలయాలను ప్రారంభించాల్సి ఉందన్నారు. 11 వైఎస్సార్ హెల్త్ క్లినిక్ నిర్మాణం జరుగుతోందని, 16 హెల్త్ క్లినిక్స్ నిర్మాణాన్ని ప్రారంభించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అనేక సేవలకు నిర్ణీత వ్యవధిని నిర్దేశించిందని చెప్పారు. గడువులోగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వ పథకాలను అందజేయాలన్నారు. పేదప్రజలకు మేలు జరగాలన్న ఉద్దేశ్యంతో సీఎం జగన్మోహనరెడ్డి సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారని చెప్పారు. వ్యవసాయ, అనుబంధ శాఖలైన హార్టికల్చర్, అగ్రి ఇన్ ఫ్రా, పశుసంవర్ధక శాఖలపై కూడా సీఎం జగన్మోహనరెడ్డి ఎప్పటికపుడు సమీక్షలు జరుపుతున్నారని తెలిపారు. ఆర్‌బీకేల వద్ద 15 రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారని చెప్పారు. రైతుభరోసా కేంద్రాల స్థాయిలో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. ఈ సెంటర్ల వల్ల రైతులకు అందుబాటులో పరికరాలు ఉంటాయన్నారు. కూలీల కొరత సమస్య తగ్గుతుందన్నారు. తక్కువ ఖర్చుకే వ్యవసాయ ఉపకరణాలు అందుబాటులో ఉంటాయన్నారు. యంత్ర పరికరాల అద్దె వివరాలు రైతుభరోసా కేంద్రాల్లోనే ప్రదర్శిస్తారన్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున పంటల కొనుగోళ్ళు కూడా జరుపుతోందన్నారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోనూ 24 గంటలూ ఉచిత వైద్యం అందుతుందన్నారు. అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ ప్రజలు, రైతుల కోసం సీఎం జగన్మోహనరెడ్డి పెద్దఎత్తున నిధులను ఖర్చు చేస్తున్నారని మంత్రి కొడాలి నాని తెలిపారు.
జిల్లా కలెక్టరు జె. నివాస్ సమీక్షిస్తూ జిల్లాలో వివిధ స్థాయిల్లో నిర్మాణ దశల్లో ఉన్న గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకే, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ లు, బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాలు త్వరిత గతిన పూర్తి చేసేవిధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అక్టోబరు 2 మహాత్మా గాంధి జయంతి నాటికి రాష్ట్రంలో 75 శాతం నిర్మాణాలు పూర్తి చేయాలని రాష్ట ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశించి యున్నారని ఆదిశగా అధికారులు గ్రామాల్లోని స్థాని ప్రజా ప్రతినిధుల సహకారంతో పూర్తి చేయ్యాలన్నారు. నియోజకవర్గంలో 417 సచివాలాయలకు స్లాబ్ లు పడి 50 శాతం పనులు మాత్రమే జరిగాయని, ఇంకా మొదల పెట్టని వాటిని వెంటనే పనులు ప్రారంభించి నూరు శాతం ప్రగతి చూపించాలన్నారు. ఆర్బీకే కేంద్ర భవనాలకు ఇంకా 50 శాతం పనులు మొదలు పెట్టలేదని వెంటనే ప్రారంభించాల్సిందిగా ఆదేశించారు. అదేవిదంగా 770 బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాలకు గాను 410 మాత్రమే గ్రౌండింగ్ జరిగాయని మండలానికి రెండు చొప్పున పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు. గుడివాడ నియోజకవర్గంలోని గుడివాడ అర్బన్ రూరల్, గుడ్లవల్లేరు, నందివాడ మండలాల్లో నిర్మించే గృహనిర్మాణం పురోగతిపై సమీక్షిస్తూ గృహనిర్మాణ పనులకు సంబందించి పెమెంట్లు సమస్య రాకుండా నెల చివరిలో పేమెంట్లు అందించడం జరగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు. ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ ద్వారా ప్రతి రోజు 600 టన్నుల ఇసుక సరఫరా చేస్తున్నామన్నారు. సిమ్మెంట్, ఐరన్ రడీగా అందుబాటులో ఉందన్నారు., జిల్లాలో 16 వేలమంది గృహనిర్మాణ లబ్దిదారులకు రుణ సౌకర్యం కూడా కల్పించామని, అధికారులు లబ్దిదారులను మోటివేట్ చేస్తూ ఇల్లు నిర్మించుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో ఎన్నడూ లేని విదంగా జగనన్న కాలనీల్లో అంతర్గత రహదారులు, విద్యుత్, నీటి వసతి, మెరక వంటి సౌకర్యాలు ఏర్పాటు చేసినా ఇల్ల నిర్మాణంలో ఎందు జాప్యం జరుగుతుందని అధికారులను నిలదీసారు. మండల స్థాయిలో అధికారులు సమావేశాలు నిర్వహించి సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. వీటితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచ్ ఇతర నాయకులను సహాకారం తీసుకొంటూ ఇల్ల నిర్మాణంలో పురోగతి సాధించాలన్నారు. గుడివాడ పట్టణంలో 5594 ఇళ్లు లబ్దిదారులకు మంజురూ చేయగా మొదటిదశలో 1260 ఇల్లు నిర్మాణం చేపట్టామని ఇందులో 460 మంది గ్రౌండింగ్ పనులు పూర్తి చేసారని మున్సిపల్ కమీషనరు కలెక్టరు వివరించారు. ప్రతి లే అవుట్ ముందుకొచ్చిన కాంట్రాక్టర్లు పూర్తిగా ఇంటి నిర్మాణ మెటీరియల్ అందించి కనీసం 50 నుంచి 100 ఇల్లు కట్టేలా అధికారులు ప్రణాళికలు సిద్దం చేసుకొని లక్ష్యాలను పూర్తి చెయ్యాలన్నారు. అదేవిధంగా గుడ్లవల్లేరు లో 600 ఇళ్లు ఇంకా గ్రౌండింగ్ కాకపోవడం పై అధికారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నందివాడ, గుడివాడ రూరల్ మండలాల్లో ఇంకా గ్రౌండింగ్ కాని ఇల్ల లబ్దిదారులచేత నిర్మాణం చేపట్టే విధంగా మోటివేట్ చెయ్యాలని కలెక్టరు అధికారులను ఆదేశించారు. ఇళ్లు, ప్రభుత్వ భవానాల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను ఖచ్చింగా పాటించాలని అధికారులకు కలెక్టరుసూచించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు (రెవెన్యూ రైతు భరోసా) డాక్టర్ కే మాధవీలత, జాయింట్ కలెక్టరు (హౌసింగ్) శ్రీవాసు నుపూర్ అజయ్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ శోభిక, గృహనిర్మాణ సంస్థ పీడీ రామచంద్రన్, డ్వామా పీడీ సూర్యనారాయణ, హౌసింగ్ ఈఈ శ్రీదేవి, డీఈ రామోజీనాయక్, మండల తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎండీవో వెంకటరమణ, పలువులు గ్రామ సర్పంచ్ లు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News