Breaking News

“దీన్ దయాళ్ స్పర్ష్ యోజన” ఫిలాటిలీ స్కాలర్షిప్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థులలో ఫిలాటలీ పై ఆసక్తిని పెంచడం కోసం 03.11.2017 న తపాలా శాఖ – భారత ప్రభుత్వం “దీన్ దయాళ్ స్పర్ష్ యోజన” ( ఆప్టిట్యూడ్ & రీసెర్చ్ ని అభిరుచిగా ప్రోత్సాహించడానికి) ఫిలాటిలీ స్కాలర్షిప్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. VI నుండి IX తరగతి విద్యార్థులకు మంచి అకడమిక్ రికార్డ్ కలిగి మరియు ఫిలాటలిని ఒక అభిరుచిగా కొనసాగిస్తున్న విద్యార్థుల కు కేంద్ర ప్రభుత్వ తపాలా శాఖ నిర్వహించే ఫిలాటలి క్విజ్ & ఫిలాటలి ప్రాజెక్ట్ ఆధారము గా అవార్డు గ్రహీతల కు మొత్తం రూ.6000/- స్కాలర్ షిప్ అందజేస్తారు.

అర్హత: గుర్తింపు పొందిన పాఠశాలల్లో VI నుండి IX తరగతి విద్యార్థులు పోస్ట్ ఆఫీసులో ఫిలాటలి డిపాజిట్ ఖాతా కలిగి ఉండాలి లేదా పాఠశాలలో ని ఫిలాటలి క్లబ్ లో సభ్యుడి గా ఉండాలి. ఒక అభ్యర్థి తప్పనిసరి గా మంచి ఆకడమిక్ రికార్డ్ కలిగి ఉండాలి. అంటే స్కాలర్ షిప్ కోసము ఎంపిక చేసి సమయములో ఈ సంవత్సరము లో అభ్యర్థి కనీసం చివరి పరీక్షలో 60% మార్కులు లేదా దానికి సమానమైన గ్రేడ్ పాయింటు స్కోర్ చేసి ఉండాలి. ఎంపిక ప్రక్రియ : డివిజన్ స్థాయి లో 30 సెప్టెంబర్ 2025 న తపాలా శాఖ ద్వారా ఫిలాటలి క్విజ్ వ్రాత పరీక్ష ద్వారా నిర్వహించబడుతుంది. పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత 15 రోజుల లోపు ఎంపికైన విద్యార్థులు వారి యొక్క ఫిలాటలి ప్రాజెక్ట్ ను తపాలా శాఖ వారికి అందజేయాలి.

ఔత్సాహిక విద్యార్థులు వారి యొక్క ధరఖాస్తులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు చే సంతకం చేయించి 16 సెప్టెంబర్ 2025 లోపు పంపవలెను. ఈ కవర్ పై ఫిలాటలి స్టాంప్ లను అతికించి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపవలెను. ప్రైవేట్ కొరియర్స్ ద్వారా వచ్చిన ధరఖాస్తులు స్వీకరించబడవు.

చిరునామా:
The Postmaster General
Vijayawada Region
Near Gandhinagaram Post Offie
Vijayawada-520 003

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *