Breaking News

తోతాపురి మామిడికి ప్రభుత్వం అందించే సబ్సిడీ దుర్వినియోగం కాకుండా మండల అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులు చర్యలు చేపట్టాలి

-రెండు రోజులు లోపల సర్వే ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి లేకపోతే
-క్రమశిక్షణ చర్యలు చేపట్టడం జరుగుతుంది
-జిల్లా కలెక్టర్

చిత్తూరు, నేటి పత్రిక ప్రజావార్త :
తోతాపురి మామిడి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునే విధంగా రూ.4.00 లను సబ్సిడీ రూపంలో మామిడి రైతులకు అందించనున్న నేపథ్యంలో ఆర్థిక సహాయం దుర్వినియోగం కాకుండా రైతులు సరి అయిన విధానంలో అందేలా మండల అగ్రికల్చర్, హార్టికల్చర్, పట్టు పరిశ్రమ అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు.

సోమవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరం నుండి మామిడి రైతులకు అందించాల్సిన సబ్సిడీ పై మండల అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాదరి తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు మూడు లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడి రైతుల నుండి గుజ్జు పరిశ్రమలకు అందించడం జరిగిందని, జిల్లాలో ఇప్పటివరకు సేకరించిన మామిడికి రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న రూ.4.00 సబ్సిడీ మొత్తం రూ. 130 కోట్లు రైతులు ఖాతాలకు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. తోతాపురి మామిడి రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న సబ్సిడీ దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత మండల అధికారులపై ఉందని తెలిపారు. జూన్ నెల వరకు సేకరించిన మామిడికి సంబంధించి సబ్సిడీ జూలై నెలలో, అలాగే జూలై నెలలో సేకరిస్తున్న మామిడి కి సంబంధించి సబ్సిడీ ఆగస్టు నెలలో రైతులు ఖాతాలోకి జమ చేయడం జరుగుతుందని తెలిపారు. మండల స్థాయి బృందం (MAO/HOసంబంధిత అధికారులు మామిడి డేటాపరిశీలన ఎలాంటి తప్పులు లేకుండా డేటా ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించారు
ఇప్పటివరకు రైతుల నుండి పెద్దఎత్తున సేకరణ జరిగింది. మొత్తం 81,455 మంది రైతుల నుండి 3,75,383 మెట్రిక్ టన్నుల మామిడి పంట మామిడి పంట సేకరించబడింది. ఇందులో – పల్ప్ యూనిట్ల ద్వారా 49,535 మంది రైతుల నుండి 2,30,518 మెట్రిక్ టన్నులు సేకరించబడ్డాయి. రాంపులు / మండీల ద్వారా 31,920 మంది రైతుల నుండి 1,44,865 మెట్రిక్ టన్నులు సేకరించబడ్డాయి. ఇంకా 2402 ఎంట్రీలు (11651 మెట్రిక్ టన్నులు) ఇతర RSKలు మరియు ఇతర మండలాలకు సంబంధించినవి పెండింగ్‌లో ఉన్నాయి. తుది RSK వారీగా మరియు మండల వారీగా హార్డ్ కాపీలను 20.08.2025లోపు సంబంధిత RSK ఇన్‌చార్జీలు మరియు మండల బృందానికి అందజేయాలి. సంతకాలుచేసిన కాపీలను 23.08.2025లోపు సమర్పించాలి. ప్రతి షీట్‌పై RSK ఇన్‌చార్జీ మరియు వీఆర్‌ఓ సంతకం చేయాలి తెలిపారు రైతులు e-Cropలో నమోదు చేసి మామిడిపండ్లు సరఫరా చేసిన వారు వివరాలు
రైతు e-Cropలో మామిడి పంట నమోదు చేసి, పల్ప్ యూనిట్లు/రాంపులకు సరఫరా చేసిన వివరాలు
నమోదు చేసిన పరిమాణం, సరఫరా చేసిన పరిమాణానికి సరిపోతుందా అని ధృవీకరించాలి.. మామిడి పంట ఉన్నా e-Cropలో నమోదు చేయని రైతులుపంట నమోదు చేయకపోయినా, మామిడి పండ్లు సరఫరా చేశారు.
ఫీల్డ్ వెరిఫికేషన్ చేయాలి:
పంట ఉన్నదని ధృవీకరించాలి.
విస్తీర్ణం మరియు పరిమాణాన్ని అంచనా వేయాలి.అన్ని వివరాలను రికార్డు చేయాలి ఇందులో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జోడి మురళీకృష్ణ, ఆర్టికల్చర్ అధికారి మధుసూదన్ రెడ్డి, మార్కెటింగ్ శాఖ అధికారి పరమేశ్వరన్, సెరికల్చర్ జెడి పద్మావతమ్మ, ఇతర అధికారులు, మండల వ్యవసాయ ఆర్టికల్చర్, సెరికల్చర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *