Breaking News

ఆరేళ్లుగా ఆగిపోయిన ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతలకు ప్రభుత్వం మోక్షం కల్పించాలి… : ఇ.యు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతలకు ఆరేళ్లుగా వివిధ కారణాలుతో ప్రభుత్వం జాప్యం చేస్తూనే ఉంది. అయితే ఆర్టీసీ అధికారులు పదోన్నతుల ఫైళ్ళను ప్రభుత్వానికి పంపుతున్నా, ప్రభుత్వం మళ్లీ వాటిని వెనక్కి పంపడం జరుగుతోంది. దీంతో ఆర్టిసి ఉద్యోగుల పదోన్నతులకు ఇప్పటివరకు మోక్షం దొరకలేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చొరవ తీసుకొని పదోన్నతలకు మోక్షం కల్పించాలని ఏపిపిటిడి (ఆర్టీసి) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్రఅధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వీ.నరసయ్య మంగళవారం ఒక ప్రకటన ద్వారా ప్రభుత్వానికీ వెజ్ఞప్తి చేసారు.

గత నెల 31న ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులపై ఫైల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్దకు వెళ్లినా, ఇంతవరకు పైలు అక్కడనుండి కదల కుండా అక్కడే ఆగిపోయింది. ఆర్టీసి ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు అర్థం చేసుకోవాలి. పదోన్నతుల కోసం ఎదురుచూస్తూనే ఈ ఆరేళ్లలో సుమారు 2000 మంది ఉద్యోగులు రిటైర్ కావడం విచారకరం. కావున వెంటనే పదోన్నతులకు అనుమతులు ఇస్తే ఆర్టీసిలో అధికారులు నుండి క్లాస్‌ఫ్లోర్ ఉద్యోగుల వరకు సుమారు 3000 మందికి పదోన్నతులు లభిస్తాయి. ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది.ఆగస్టు 15న ముఖ్యమంత్రి గారు స్త్రీశక్తి పధకం ప్రారంభానికి వచ్చిన సందర్భంగా ఈ పదోన్నతలు పై ఇ.యు రాష్ట్రకమిటీ తరఫున లేఖను కూడా ఇవ్వడం జరిగింది. కావున ముఖ్యమంత్రి, రవాణా మంత్రి స్వయంగా చొరవ తీసుకొని ఆర్టీసి ఉద్యోగుల పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉద్యోగులలో ఉన్న అసంతృప్తిని తగ్గించాలని ఇ.యు నాయకులు విజ్ఞప్తి చేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *