Breaking News

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఎం చంద్రబాబు చే ప్రారంభం

మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్ లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర మానవ వనరులు. ఐటి, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఆర్టీజి శాఖల మంత్రి నారా లోకేష్ , రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ సెక్రటరీ డా. కే యువరాజ్, రాష్ట్ర ఐటీఈ అండ్ సీ సెక్రటరీ కాటమనేని భాస్కర్, కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, ఏపీ ఇన్నోవేషన్ సోసైటీ సీఈఓ సూర్యతేజ, టాటా సన్స్ అండ్ టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, భారత్ ఫోర్జీ చైర్మన్ బాబా కళ్యాణ్, అమర్ రాజా గ్రూప్ చైర్మన్, మాజీ పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్ పాల్గొన్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. స్టార్ట్ అప్ స్టాల్స్, ఎమ్ ఎస్ ఎం ఈ స్టాల్స్ ను ముఖ్యమంత్రి పరిశీలించి, ప్రోటో టైప్ ఫ్యాబ్ ల్యాబ్ ను, శిక్షణ తరగతి గదులను సందర్శించారు. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, అనంతపురం, తిరుపతి లో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వర్చువల్ గా ప్రారంభించారు. ఆవిష్కరణ అంధ్రప్రదేశ్ ప్రతిజ్ఞ చేశారు. స్టార్టప్ బిజినెస్ మేనేజ్మేంట్ లెసెన్ ఈ లెర్నింగ్ కు 24 గంటల్లో 1,67,321 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేతుల మీదుగా ఏపీ ఇన్నోవేషన్ సోసైటీ సీఈఓ సూర్యతేజ కు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ను అందించారు.
కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా, వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, ఐటీ, స్టార్ట్ ఆప్ కంపెనీల ప్రతినిధులు, యువ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *