Breaking News

అమ్మ కోసం ఒక చెట్టు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పెన్నాడ భీమవరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల నందు భారత ప్రభుత్వ యువజన మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మేరా యువభారత్ పశ్చిమగోదావరి జిల్లా మరియు జాతీయ సేవా పథకం సంయుక్త ఆధ్వర్యంలో అమ్మ కోసం ఒక చెట్టు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎకడమిక్ డీన్ డాక్టర్ కురెళ్ళ భాస్కరరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మనమందరం కృషి చేయాలని, రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛ ఆరోగ్య వాయువులను పీల్చుకోవాలంటే యువత అయినా మీరందరూ మొక్కలు నాటి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలని అది కూడా మీ తల్లి పేరుతో నాటినట్లయితే దానిని జాగ్రత్తగా పెంచుతారని తద్వారా పర్యావరణానికి మన వంతు సాయం చేసిన వారు అవుతారని కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మీ పరిసర ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించడం మీ బాధ్యతని అన్నారు. అనంతరం పెన్నాడ గ్రామ కార్యదర్శి కె వెంకటరాజు ని సత్కరించి విద్యార్థులకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేరా యువభారత్ పశ్చిమగోదావరి అధికారి కే రాజేష్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఏ బి ఎస్ ఆర్ మనోహర్, ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ కే రాగిణి అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *