విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాఠశాలలోని విద్యార్థుల వ్యక్తిగత మానసిక,శారీరక పురోగాభివృద్ధికి వ్యాయామ ఉపాధ్యాయులు కృషి ఎంతైనా అవసరమని రాష్ట్ర పాఠశాల విద్యా ప్రాంతీయ (కాకినాడ) సంచాలకులు జి.నాగమణి పేర్కొన్నారు. శనివారం ఎన్ టి ఆర్ జిల్లా విద్యాశాఖాధి కార్యాలయంలో స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్స్లెన్స్ అవార్డు ల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి నాగమణి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ నేడు విద్యార్థులు ప్రతి చిన్న విషయానికి మానసిక ఒత్తిడికి గురై ఆత్మ హత్యలు దాకా వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు దేనినైనా ఎదుర్కునే మానసిక స్థైర్యం ఉందని అది వ్యాయామ ఉపాధ్యాయులు వల్లే సాధ్యమవుతుందని అన్నారు. అన్ని ఒత్తిళ్లను అధిగమించడానికి అది ఒక్క వ్యాయామం , ఆటల వల్లే సాధ్యమని, కావున పాఠశాలల్లో వ్యాయామం క్రీడలు తప్పనిసరిగా జరిగేలా వ్యాయామ ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకోవాలని కోరారు. జిల్లా విద్యాశాఖాధి కారి యు వి సుబ్బారావు మాట్లాడుతూ చిన్న దేశాలు ఒలింపిక్స్ లో పతకాల సాధించడంలో ముందంజలో ఉన్నాయని మనం చాలా వెనుకంజలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో విద్యార్థులు అందరూ ఆటలు ఆడేలాగా వ్యాయామ ఉపాధ్యాయులు చొరవ చూపించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్స్లెన్స్ అవార్డు రాష్ట్రం లోని ఎన్ టి ఆర్ జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం ఎంతో గర్వ కారణం అని, గత మూడేళ్ళనుంచి ఈ అవార్డులను రాష్ట్రం లో నే ఎన్టీఆర్ జిల్లా దక్కించుకోవడం సరికొత్త రికార్డు అని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం రాష్ట్రం లోని ప్రథమ స్థానం సాధించిన నున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ రవిప్రసాద్,వ్యాయామ ఉపాధ్యాయులు టి శ్రీలత,టి.విజయ వర్మ లను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. అదేవిధంగా జిల్లా లో ద్వితీయ స్థానం కె బి సి జిల్లా పరిషత్ హై స్కూల్,తృతీయ స్థానం ఎస్ టి వి ఆర్ మున్సిపల్ హై స్కూల్, చతుర్థ స్థానం నిడమానూరు జిల్లా పరిషత్ హై స్కూల్, ఐదవ స్థానం ఎస్ కె పి వి వి హిందూ హై స్కూల్ కు అవార్డులను అందజేశారు. గత మూడేళ్ల నుంచి పాఠశాల క్రీడల్లో ఎన్టీఆర్ జిల్లా రాష్ట్రం లో నే అగ్ర స్థానం నిలవడానికి తోడ్పడిన జిల్లా విద్యా శాఖ అధికారి యు వి సుబ్బారావు ను వ్యాయామ ఉపాధ్యాయులు గానం గా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సూపరింటెండెంట్ జి.రమణ కుమారి, వ్యాయామ ఉపాధ్యాయులు ఎన్ వి వి భాస్కర్,డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News