-అధికారులు నిబద్దతో, అంకిత భావంతో పనిచేయాలి
-బి సి సంక్షేమ శాఖ కార్యదర్శి పి. సత్యనారాయణ పిలుపు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాయలసీమకు చెందిన తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, కడప జిల్లాల్లోని వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ లోని జిల్లా అధికారులు, సహాయ సంక్షేమ అధికారులు, వసతి గృహ సంక్షేమ అధికారులకు ఒక రోజు “సెన్స్ డైజేషన్ కార్యక్రమం ” తిరుపతి తుడా ఆవరణం కచ్చపి ఆడిటోరియంలో బుధవారం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆ శాఖ ఎక్సఫిషియో కార్యదర్శి పి సత్యనారాయణ గారు మాట్లాడుతూ సంక్షేమ అధికారులు వసతి గృహ విద్యార్థుల సంక్షేమం కోసం, విద్యాభివృద్ది కోసం పాటు పడాలని, వసతి గృహ విద్యార్థులను తమ సొంత బిడ్డలుగా భావించి వారి బాగోగులు పట్టించుకోవాలని, సంక్షేమ అధికారులు పనిచేసే చోట నివసించాలని , వసతి గృహాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని సంక్షేమ అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బి సి సంక్షేమ డైరెక్టర్ ఏ. మల్లికార్జున మాట్లాడుతూ వసతి గృహాలలో ట్యూటర్లను నియమించి మంచి ఫలితాలు సాధించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల, వసతి గృహ నిర్వహణ పట్ల అలక్ష్యం తగదని, విధి నిర్వహణలో అలసత్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వసతి గృహాలలో మెనూ తప్పకుండా అమలు చేయాలని, వసతి గృహ విద్యార్థుల చదువు పట్ల జాగరూకత కలిగి ఉండాలని కోరారు. వసతి గృహాల మరమ్మత్తులకు అవసరమైన నిధులు మంజూరు చేసామని, గతంలో పెండింగ్ బిల్లులు అన్నీ చెల్లించామని, ప్రతి వసతి గృహానికి ఇన్వెర్టర్, వంట పాత్రలు, నీటి శుద్ధ జల యంత్రాలు సరఫరా చేసామని, విద్యార్థులకు క్రీడా పరికరాలు, ఆట వస్తువులు సరఫరా చేస్తామమని, ఈ విద్యా సంవత్సరానికి దుప్పట్లు, కార్పెట్లు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.
సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ డి చంద్ర శేఖర్ రాజు మాట్లాడుతూ వసతి గృహ విద్యార్థులకు వారం వారం పరీక్షలు నిర్వహించి మూల్యాంకనం చేసి మంచి ఫలితాలు సాధించాలని, జిల్లా, రాష్ట్ర స్థాయిలో మంచి ఫలితాలకు వచ్చేలా పాటు పాడాలని కోరారు.
సంక్షేమ అధికారులకు జాగృతం చేయడానికి విచ్చేసిన పద్మావతి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ భువనేశ్వరి మాట్లాడుతూ విద్యార్థులలో విద్యా నైపుణ్యాలు పెంపొందించాలని, అవగాహన మెలుకువలు కల్పించాలని కోరారు.
తిరుపతి స్విమ్స్ వైద్య కళాశాల గుండె వైద్య నిపుణులు ప్రొఫెసర్ వనజ మాట్లాడుతూ విద్యార్థులలో మంచి ఆరోగ్యం, యోగా, ధ్యానం, ఆహారపు అలవాట్ల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విమ్స్ డైరెక్టర్ శ్రీమతి రాఘవేంద్ర మీరా మాట్లాడుతూ విద్యార్థుల హక్కుల పట్ల, చిన్న పిల్లల చట్టాలు, వారిని ఏ విధంగా చూసుకోవాలో, చిన్న పిల్లల పట్ల ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉండాలని, వారికి రక్షణగా ఉండే చట్టాలపట్ల అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమం తిరుపతి జిల్లా బి సి సంక్షేమ మరియు సాధికారతా అధికారి యం భరత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.
ఈ కార్యక్రమానికి తిరుపతి, అన్నమయ్య, కడప, చిత్తూరు జిల్లాల వసతి గృహ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News