Breaking News

కాలుష్య రహిత గ్రామాలుగా తీర్చి దిద్దడమే జగనన్న స్వచ్చ సంకల్ప ముఖ్యోద్దేశ్యం…

-ఉపాధి హామీ ద్వారా గ్రామాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షించాలి…
-ప్రతి గ్రామంలో ఆయా గ్రామ పంచాయితీలు గ్రీన్ అంబాసిడర్గా సిద్ధం చేసుకోవాలి…
-సీఈవో, సూర్యప్రకాశరావు, డీపీఓ జ్యోతి

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యావరణ పరిరక్షణ, పరిశరాల పరిశుభ్రత, కాలుష్య నివారణ దిశగా గ్రామాలను తీర్చి దిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న స్వచ్చసంకల్ప కార్యక్రమాన్ని ప్రవేశపెట్టనున్నదని జిల్లా పరిషత్ సీఇవో పీఎస్. సూర్య చంద్రరావు అన్నారు.
స్థానిక మార్కెట్ యార్డు లో శనివారం నియోజకవర్గ స్థాయి జగనన్న స్వచ్చసంకల్ప అవగాహన కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ లు, కార్యదర్శులతో సీఈవో సూర్యచంద్రరావు, డీపీవో జ్యోతి నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జగనన్న స్వచ్చ సంకల్పం ద్వారా ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు సర్పంచ్ లు, పంచాయితీ కార్యదర్శులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి పంచాయతీలో వనరులను సమీకరించుకోవడంతో పాటు గ్రామాల్లో పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణకు జగనన్న స్వచ్ఛ సంకల్పం ద్వారా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి 250 నివాసాల నుంచి చెత్తను సేకరించే విధంగా గ్రీన్ అంబాసిడర్గా సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం సన్నాహక కార్యక్రమాల ద్వారా కోవిడ్ సమయంలో గ్రామాల్లో పారిశుధ్యం, శుభ్రత విషయంలో తీసుకున్న జాగ్రత్తలు మంచి ఫలితాలు ఇచ్చాయన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారని, వారిని కూడా జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాల్లో భాగస్వాముల్ని చేయాలని సూచించారు.
జిల్లా పంచాయితీ అధికారి ఏడీ జ్యోతి మాట్లాడుతూ పర్యావరణ పరిశుభ్రతో పాటు వాయు కాలుష్యాన్ని అరికట్టి ప్రాణవాయువు సంవృద్ది తొడ్పాటుకు ప్రతి ఒక్కరూ నీడనిచ్చే చెట్లతో పాటు పండ్ల మొక్కలు నాటాలని, అవసరమైతే ప్రైవేటు నర్సరీల నుంచి కూడా కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. జగనన్న కాలనీల్లో కాలనీల్లో ఉపాధిహామీ పథకంలో అవెన్యూ ప్లాంటేషన్ భారీగా చేపట్టాలన్నారు. అవసరం మేరకు తమ గ్రామాల్లోని ప్రజా ప్రతినిధుల సహకారం వారి భాగస్వామ్యంతో కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. గ్రామాల్లో జగనన్న స్వచ్చ సంకల్పంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కాలుష్యరహిత సమాజమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్యేద్దేశ్యం అన్నారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ బోధ వంటి వ్యాధులు ప్రభలకుండా ప్రతి రోజు శానిటేషన్ చెయించడం, డ్రైనేజీల్లో మురగునీరు నిల్వ ఉండకుండా పారుదల అయ్యేలా పంచాయితీలు చర్యలు చేపట్టాలన్నారు.
కార్యక్రమంలో డి ఎల్ పి ఓ నాగిరెడ్డి, యంపీడీవోలు గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు వెంకటరమణ,విష్ణు ప్రసాద్, మణికుమార్ ఏవో డి పి ఆర్ సి కృష్ణ ప్రసాద్, డీపీఆర్ సీ పరిపాలన అధికారి కృష్ణప్రసాద్, ఈవోపీఆర్డీ లు వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, ఆర్ డబ్ల్యూఎస్ డీఇ లీలాకృష్ణ, జిల్లా మలేరియా అధికారి, గుడివాడ, గుడ్లవల్లేరు, నందివాడ గ్రామ పంచాయితీ సర్పంచ్ లు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు

Check Also

గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కి కృతజ్ఞతలు

-ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్  అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *