Breaking News

పౌరులకు మెరుగైన సేవలందిద్దాం… : క‌మీష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్

 -రోట‌రీ, ల‌య‌న్ క్ల‌బ్ ప్ర‌తినిధుల‌తో క‌మీష‌న‌ర్ సమావేశం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
న‌గ‌రంలో వివిధ రంగాల్లో సేవ‌లందిస్తున్న రోట‌రీ, ల‌య‌స్ క్ల‌బ్ ప్ర‌తినిధుల‌తో న‌గ‌ర పాల‌క సంస్థ క‌మీష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్ శ‌నివారం న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాలయంలో స‌మావేశం అయ్యారు. విజ‌య‌వాడలో విద్యా, వైద్యం, పారిశుధ్యం, జీవనోపాధి రంగాల్లో మ‌రింత మంది సేవ‌లందించేందుకు న‌గ‌ర‌పాలక సంస్థ తో క‌లిసి పనిచేసేంద‌కు ముందుకు రావాల‌ని రోట‌రీ, ల‌య‌న్ క్ల‌బ్ ప్ర‌తినిధుల‌కు క‌మిష‌న‌ర్ సూచించారు. ఇప్ప‌టికే రోట‌రీ, ల‌య‌న్ క్ల‌బ్ అధ్వ‌ర్యంలో న‌గ‌రంలో అనేక సేవాలందిస్తున్నార‌న్నారు. వారి సేవ‌ల‌ను క‌మీష‌న‌ర్ ఈ సంద‌ర్భంగా అభినందించారు.. ముఖ్యంగా ర‌క్త‌దానం, కోవిడ్ నియంత్రణపై ప్రజలకు అవగాహన, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల పెంపకం, ప్రతిభ గల విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించ‌డం వంటి సేవాలందిస్తున్నార‌న్నారు. స‌మావేశంలో KNSR ప్రసాద్, ప్రెసిడెంట్ రోటరీ క్లబ్ అఫ్ విజయవాడ, V.కేశవరావు, ప్రెసిడెంట్ రోటరీ క్లబ్ అఫ్ విజయవాడ సెంట్రల్, V.వెంకటేశ్వరరావు పాస్ట్ ప్రెసిడెంట్ రోటరీ క్లబ్ అఫ్ విజయవాడ ఈస్ట్, Y.పార్ధసారధి ప్రెసిడెంట్ రోటరీ క్లబ్ అఫ్ విజయవాడ మిడ్ టౌన్, G.రవీంద్ర ప్రెసిడెంట్ రోటరీ క్లబ్ అఫ్ విజయవాడ శ్రీదుర్గా, D.జొని కుమారి, డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్స్ క్లబ్ కృష్ణ డిస్ట్రిక్ట్, D.శ్రీ శాంతి, ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్, లయన్స్ క్లబ్ కృష్ణ డిస్ట్రిక్ట్, JN శంకర గుప్త రెండోవ‌ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్స్ క్లబ్ కృష్ణ డిస్ట్రిక్ట్ మరియు Y గాంధీ డిస్ట్రిక్ట్ కాబినెట్ సెక్రటరీ లయన్స్ క్లబ్ కృష్ణ డిస్ట్రిక్ట్ ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *