హిందూపూర్, నేటి పత్రిక ప్రజావార్త :
ఎబిపిఎస్ఎస్పి ఆంధ్రప్రదేశ్ బృందం హిందూపూర్ ఎమ్మెల్యే పద్మభూషణ నందమూరి బాలకృష్ణ ని గురువారం కలిసి బాలికల సైనిక్ స్కూల్ మరియు ఇతర రక్షణ సౌకర్యాల కోసం 12 ఎకరాల భూమిని కేటాయించాలని అభ్యర్థించింది. దానికి ఎమ్మెల్యే బాలకృష్ణ సానుకూలంగా స్పందించినట్లు ఎబిపిఎస్ఎస్పి ఆంధ్రప్రదేశ్.అధ్యక్షుడు కల్నల్ పాలేటి రాంబాబు (రిటైర్డ్) తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎబిపిఎస్ఎస్పి ఆంధ్రప్రదేశ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News