-సెప్టెంబర్ 14, 15 వ తేదీలలో తిరుపతి జిల్లాలో జరుగు జాతీయ మహిళా సాధికారిత కాన్ఫరెన్స్ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ సెక్రెటరీ జనరల్ ప్రసన్నకుమార్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సెప్టెంబర్ 14, 15 వ తేదీలలో తిరుపతి జిల్లాలో జరుగు జాతీయ మహిళా సాధికారిత కాన్ఫరెన్స్ కు చేపట్టవలసిన ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ సెక్రెటరీ జనరల్ ప్రసన్నకుమార్ మరియు జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ జిల్లా ఎస్ పి, హర్ష వర్ధన్ రాజు,జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, మునిసిపల్ కమీషనర్ నారపు రెడ్డి మౌర్య లతో కలిసి శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ మినీ కాన్ఫెరెన్స్ హాల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతీయ మహిళా సాధికారిత కు కాన్ఫరెన్స్ విజయవంతం అయ్యేలా ఆన్ని ఏర్పాట్లు చేయాలని సంబందిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ సెక్రెటరీ జనరల్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ నందు జాతీయ మహిళా సాధికారిత కు కాన్ఫరెన్స్ కు దేశంలోని ప్రతి రాష్ట్రం నుండి సభ్యులు హాజరు కావడం జరుగుతుందని తెలిపారు. వీరందరూ కూడా రెండు రోజులు మహిళలల సమస్యల మీద సుదీర్ఘంగా చర్చించడం జరుగుతుందని ఈ కార్యక్రమాన్నిఅన్ని శాఖల వారు సమన్వయంతో విజయవంతం చేయాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 14, 15 వ తేదీలలో జాతీయ మహిళా సాధికారిత కు కాన్ఫరెన్స్ కు అన్ని రాష్ట్రాల నుండి మహిళా ప్రతినిధులు రానున్నారని అలాగే లోక్ సభ, శాసన సభ స్పీకర్లు, రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి ,రాష్ట్ర మంత్రులు మరియు ఇతర ప్రముఖులు విచ్చేయనున్నారని ఇందులో భాగంగా వివిధ శాఖల అధికారులకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు.
అనంతరం తిరుపతి రాహుల్ కన్వర్షన్ సెంటర్ నందు జరుగు జాతీయ మహిళా సాధికారిత కాన్ఫరెన్స్ కు సంభందించి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ సెక్రెటరీ జనరల్ ప్రసన్నకుమార్, జిల్లా ఎస్ పి, హర్ష వర్ధన్ రాజు,జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, మునిసిపల్ కమీషనర్ నారపు రెడ్డి మౌర్య, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘు వాన్షి లతో కలిసి ముందుస్తూ ఏర్పాట్లపై పరిశీలించి వేదిక నందు ఏర్పాటు చేయవలసిన మౌలిక వసతులను, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు చేయాలనీ ఎటువంటి ఆటంకాలు కలగకుండా సంబందిత అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని ఆదేశించారు.
అనంతరం జాతీయ మహిళా సాధికారిత కమిటీ సభ్యులు చంద్రగిరి కోటను సందర్శన చేయు సందర్భంగా చంద్రగిరి కోట నందు చేపట్టవలసిన ఏర్పాట్లపై టూరిజం అధికారులతో కలసి పర్యవేక్షించి చంద్రగిరి కోటను అన్ని హంగులతో సిద్ధం చేసి వచ్చు ప్రముఖులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. కోట నందు సాంస్కృతిక కార్యక్రమాలను మరియు మ్యూజిక్ లైట్ అండ్ సౌండ్స్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే చంద్రగిరి కోటకు చేరుకునే మార్గంలో అప్రోచ్ రోడ్లు, చంద్రగిరి కోట వద్ద బ్యారికేడ్ల ఏర్పాటు, స్టేజ్ వద్ద ఎల్ ఈ డి స్క్రీన్ తదితర ఏర్పాట్లపై సంబందిత అధికారులకు పలు సూచనలు చేసారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ నరసింహులు, తిరుపతి, శ్రీకాళహస్తి, ఆర్ డి ఓ లు రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, ప్రోటోకాల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శివశంకర్ నాయక్, అడిషినల్ ఎస్.పి. రవిమనోహరాచ్చారి, డిపిఓ సుశీల దేవి, తిరుపతి, చంద్రగిరి డిఎస్పీలు, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్సీ సురేందర్ నాయుడు, టూరిజం ఆర్.డి. రమణ ప్రసాద్, డి ఐ పి ఆర్ ఓ పి గురుస్వామి శెట్టి, సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News