గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం గుంటూరు కలక్టరేట్ లో ఆధునీకరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్ ను జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ సంయుక్త కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ తో కలసి ప్రారంభించారు. శాస్త్రోత్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించి రిబ్బన్ కత్తిరించి వీసీ హాల్ ను ప్రారంభించారు. అనంతరం సమావేశ మందిరంలో నూతనంగా ఏర్పాటు చేసిన పీఏ సిస్టమ్ , వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్ , ఫర్నిచర్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కె.ఖాజావలి , ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఏపీడబ్ల్యూఐఈడీసీ అనిల్ కుమార్, కలక్టరేట్ ఏ.ఓ పూర్ణచంద్ర రావు, కలక్టరేట్ లోని విభాగాల సెక్షన్ పర్యవేక్షకులు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News