Breaking News

ఆర్ఎంఎస్ఎస్ రాష్ట్ర కార్యవర్గం నియామకం 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రీయ మోదీ సేవా సమితి (ఆర్ఎంఎస్ఎస్) నూతనంగా ఎన్నిక కాబడిన రాష్ట్ర కార్యవర్గం (పదాధికారులు) నియామక పత్రాలు అందజేత కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆదివారం గాంధీ నగర్ లో ప్రైవేట్ హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్రీయ మోదీ సేవా సమితి జాతీయ అధ్యక్షులు వికాస్ యదువన్షి హాజరయ్యారు. ఎపిలో అన్ని జిల్లాల నుండి విచ్చేసిన నూతనంగా ఎన్నికైన పదాధికారులు కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులు వికాస్ యదువన్షి చేతుల మీదుగా ఏపీ ప్రెసిడెంట్ గా అన్నం అజయ్, కార్యదర్శి గా దినేష్ కుమార్ కు నియమాక పత్రాలు అందజేశారు. అనంతరం ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా 75 మంది పేదలకు నిత్యావసరలు కిట్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు వికాస్ యదువన్షి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికైన పదాధికారులకు అభినందనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రజా సంక్షేమ పథకాలను సమాజంలోని చివరి వ్యక్తి వరకు చేరవేయడం ఆర్ఎంఎస్ఎస్ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యమని మా సంస్థ ప్రతి బిడ్డకు విద్యా హక్కును అందించడం, ప్రతి పౌరుడికి మెరుగైన ఆరోగ్య సేవలను అందించడం, ఆరోగ్య అవగాహనను పెంచడం చేస్తుందన్నారు.

రాష్ట్రీయ మోది సేవా సమితి (ఆర్ఎంఎస్ఎస్) ఎపీ ప్రెసిడెంట్ అన్నం అజయ్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడుగా నాకు అవకాశం ఇచ్చిన జాతీయ అధ్యక్షులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయడం వారికి అందేలా సహాయ సహకారాలు అందించడం, యువత, మహిళలు స్వయం సమృద్ధిగా ఉండటానికి ఉపాధి అవకాశాలను సృష్టించడం, రైతుల సమస్యలను పరిష్కరించడం, వ్యవసాయ రంగంలో కొత్త సాంకేతికత, పథకాలను అందించడం. గోశాల సేవ, గోశాల నిర్మాణం చేయడం ద్వారా సమాజంలో మతపరమైన, సాంస్కృతిక విలువలను పెంచేందుకు కృషి చేయడం, విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడం వారిని దేశ నిర్మాణ ప్రధాన స్రవంతితో అనుసంధానించడం చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ ప్రధాన కార్యదర్శి బాలాజీ సూర్య వన్షి, ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక ఇన్చార్జి రాహుల్ బోస్లె, ఏపీ ప్రెసిడెంట్ అన్నం అజయ్, కార్యదర్శి దినేష్ కుమార్, ఓ బి సి మోర్చా అధ్యక్షులు లక్కోజీ సుబ్రమణ్యం తదితర పదాధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *