పెంచిన సర్ చార్జీ కరెంటు బిల్లులను తగ్గించాలి… : బొండా ఉమామహేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కరెంట్ బిల్లుల్లో అదనంగా పెంచిన సర్ చార్జీ బిల్లులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ టిడిపి మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మొగల్రాజపురం లోని తన ఇంటివద్ద మంగళవారం, విలేకరుల సమావేశం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం చేతకాని తనం వల్లే 50 రూపాయల పెట్రోలు ధర 110 అయ్యిందన్నారు. ఉప్పు, పప్పు తదితర నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు. ఇప్పుడు పెంచిన కరెంటు సర్ ఛార్జి బిల్లులు కట్టలేక సామాన్య మానవుడు బ్రతకలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇది టిడిపి చేస్తున్న ఆరోపణలు కావు జగన్ మోహన్ రెడ్డి వాగ్దానాలే అన్నారు బొండా. జగన్ మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయితే నిత్యావసర, కరెంటు ధరలు పెరగకుండా చూస్తామని వాగ్దానం చేసి ఇప్పుడు సామాన్యుడి నడ్డి విరుస్తున్నారన్నారు. పెరిగిన ధరలు తగ్గించకుండా ఉంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. పెంచిన కరెంటు బిల్లులను తగలబెట్టి నిరసన వ్యక్తపరిచారు. వినాయక చవితి ఉత్సవాలను రద్దు చేయటం అమానుషం అన్నారు. రాజశేఖర్ రెడ్డి వర్ధంతికి లేని కోవిడ్ ఆంక్షలు వినాయక చవితి ఉత్సవాలకెందుకని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వినాయకచవితి చేసి తీరుతామని వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు. ఈ విషయంలో దేవాదాయశాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు జోక్యం చేసుకోకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. వినాయక చవితికి చాలమందికి ఉపాధి లభిస్తుందన్నారు. వర్ధంతికి లేని నిబంధనలు దైవసంభంద ఉత్సవాలకెందుకన్నారు. ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, నేతలు గార్లపాటి విజయ్, మొథుకురి ఖాసిం, ప్రయాగ క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సీసీఎల్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

-ఎస్సీలకు కలిగే ప్రయోజనాలను బుడగ జంగాలకూ వర్తింప చేయండి -ప్రణాళిక ప్రకారం కలెక్టర్లు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలి -కలెక్టర్ల సదస్సులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *