Breaking News

శ్రీ విశ్వకర్మ జయంతి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజ నిర్మాణానికి 5 వృత్తులను కల్పించిన ఆరాధ్యదైవం శ్రీ విశ్వకర్మ అని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర కొనియాడారు. శ్రీ విశ్వకర్మ జయంతి పురస్కరించుకొని నగరంలోని విశ్వబ్రాహ్మణ కాలనీలో గల శ్రీ శ్రీ శ్రీ విరాట్ విశ్వకర్మ దేవాలయంలో మంత్రివర్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వేద పండితులు మంత్రివర్యులకు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం మంత్రివర్యులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ శ్రీ విశ్వకర్మ అనంత విశ్వానికి సృష్టికర్త అని, సమాజ నిర్మాణంలో 5 వృత్తులు ఉండాలని వాటిని ఏర్పరిచారన్నారు. ఆయన మనందరికీ ఆరాధ్య దైవం అన్నారు.  వారి జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున రాష్ట్ర దినోత్సవం గా జరుపుకుంటున్నామన్నారు. ఈ రోజున అందరము ఎంతో భక్తిశ్రద్ధలతో స్వామివారిని పూజించుకుంటున్నామన్నారు. అందరికీ స్వామివారి ఆశీర్వచనాలు అందాలని కోరుకుంటున్నానన్నారు. ఆధునిక సాంకేతిక పద్ధతులను ప్రతి ఒక్కరూ తెలుసుకొని అన్ని వృత్తులు వారు వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. ఇవాళ బహుళ జాతి సంస్థలు ముందుకు వచ్చాయని దానికి తగిన విధంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎం ఎస్ ఎం ఈ, కేంద్ర ప్రభుత్వం, బ్యాంకు పథకాల సహకారంతో మరింత వృద్ధిలోకి రావాలన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి వెంట మునిసిపల్ కమిషనర్ బాపిరాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె నాని, మునిసిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, స్థానిక నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *