Breaking News

స్విమ్స్ ఆధ్వర్యంలో లింగేశ్వరనగర్ లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్

-వైద్యాధికారి డాక్టర్ ఉదయశ్రీ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళల ఆరోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న స్వస్థ్ నారీ సశక్త్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా టీటీడీకి చెందిన తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్) ఆధ్వర్యంలో గురువారం తిరుపతి రూరల్ మండలం లింగేశ్వర నగర్ లో ఉచిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్టు వైద్యాధికారి డాక్టర్ ఉదయశ్రీ తెలిపారు. ముందుగా క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, ముందస్తు నివారణ చర్యలపై అవగాహన కల్పించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో పింక్ బస్సు ద్వారా క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాలు, మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతున్నాయి. బిపి, షుగరు పరీక్షలతోపాటు పింక్ బస్సులో మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మామోగ్రామ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్ స్మియర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. మహిళలు, పురుషులు విశేషంగా విచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు.

పింక్ బస్ క్యాంపుల వివ‌రాలు

– సెప్టెంబర్ 22న మంగళం, తారకరామానగర్.

స్విమ్స్ డైరెక్టర్ కమ్ వైస్ చాన్సలర్ డాక్టర్ ఆర్వీ కుమార్ ఆదేశాల మేరకు కమ్యూనిటి మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ కె.నాగరాజ్, నోడల్ ఆఫీసర్లు డాక్టర్ టివిడి.ప్రత్యూష, డాక్టర్ ఎం.లలిత్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాల్లో స్విమ్స్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరిత, ఎంపిహెచ్ఈఓ శ్రీనివాసులు, సూపర్ వైజర్లు కృష్ణప్రియ, కృష్ణప్రసాద్, ఎమ్ఎల్ హెచ్ పి హేమలత, పీహెచ్సీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *