-విజయవాడ ఉత్సవ్ లో భాగంగా అక్టోబర్ 2వ తేదీన స్వచ్ఛతాన్ అనే అద్భుతమైన మారథాన్ విజయవాడ నగరం యొక్క ప్రతిష్టను పెంపొందిస్తుంది మరియు జాతీయ స్థాయిలో ఒక ఆదర్శంగా నిలుస్తుంది – బొండా సిద్దార్ధ
-ఈ చారిత్రాత్మక మారథాన్‌లో పాల్గొని, విజయవాడను స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన నగరంగా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేయాలి – బొండా సిద్దార్ధ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి రన్నర్స్ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ బందర్ రోడ్డు PWD గ్రౌండ్ 125 అడుగుల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వరకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారం “స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర” కార్యక్రమాలు సెంట్రల్ నియోజకవర్గం లో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ఆదేశాలతో “స్వచ్ఛ్ ఆంధ్ర – స్వర్ణాంధ్ర” అవగాహన సదస్సు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది…
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ IAS, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా సిద్దార్ధ మరియు గద్దె. క్రాంతి కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ విజయవాడ బందర్ రోడ్డు నందు “స్వచ్ఛత హీ సేవా హీ” కార్యక్రమాన్ని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తుంది అని, అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమాలు సెంట్రల్ నియోజకవర్గం లో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ఆదేశాలతో 21 డివిజన్ లలో విస్తృతంగా జరుగుతున్నాయని తెలిపారు.
ఈ సందర్భంగా బొండా సిద్దార్ధ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాకుండా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం లో స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి, “మొక్కలు నాటడం, పర్యావరణ పరిరక్షణ, దైనందిన పరిశుభ్రత మన అందరి భాగస్వామ్యంతోనే సాధ్యం అవుతుంది, అధికారుల నిబద్ధత, ప్రజల అవగాహన, కృషి కలిస్తేనే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. దీనికి కావలసిన నిధులు, సదుపాయాలు ప్రభుత్వం, MLA బొండా ఉమ సమకూరుస్తున్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి, ప్రజల సహకారం కలిసివస్తే మాత్రమే శాశ్వత మార్పు సాధ్యమవుతుందన్నారు.
విజయవాడ ఉత్సవ్ లో భాగంగా అక్టోబర్ 2వ తేదీన స్వచ్ఛతాన్ అనే అద్భుతమైన కార్యక్రమం నిర్వహించబడుతుంది అని, అమరావతి రన్నర్స్ ఆర్గనైజర్స్ గా ఈ మారథాన్‌లో 5000 మందికి పైగా పాల్గొనే అవకాశం ఉంది అని, ఇది 21 కిలోమీటర్లు మరియు 10 కిలోమీటర్ల దూరాలను కవర్ చేస్తుంది, అన్ని వయస్సుల వారికి పాల్గొనే అవకాశం కల్పిస్తూ గెలిచిన విజేతలకు కేటగిరి వారీగా ₹10 లక్షల రూపాయల నుండి ₹15 లక్షల రూపాయల వరకు నగదు బహుమతులు అందించబడతాయి అన్నారు.
స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఈ కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది, ఈ ఈవెంట్‌ను విజయవంతం చేయడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది అని, ఈ మారథాన్ కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు, స్వచ్ఛత మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి పట్ల అవగాహనను పెంపొందించే ఒక గొప్ప వేదిక అని, ఈ కార్యక్రమం విజయవాడ నగరంలో క్రీడా స్ఫూర్తిని మరియు సామాజిక బాధ్యతను ప్రోత్సహిస్తుంది అని, ఆసక్తి గలవారు వెంటనే రిజిస్టర్ చేసుకొని ఈ మహత్తర మారథాన్‌లో పాల్గొనవలసినదిగా కోరుతున్నాను అని, రిజిస్ట్రేషన్ కోసం vijayawadautsav.com వెబ్‌సైట్‌ను సందర్శించి ఈ మారథాన్ ప్రజలలో ఆరోగ్యం మరియు ఫిట్‌నెస్ పట్ల అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుంది అని తెలియజేసారు.
Prajavartha Online Telugu News