గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చేసే వారిపై చర్యలు:  స్కానింగ్ కేంద్రాలకు  డిప్యూటీ  డి.ఎం.హెచ్.ఓ డా. ఆశా హెచ్చరిక

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
గర్భస్థ పిండ లింగ నిర్దారణ చేసే స్కానింగ్ కేంద్రాలపై చట్టపరమైన  చర్యలు తీసుకుంటామని డిప్యూటీ  డి.ఎం.హెచ్.ఓ డా. ఆశా హెచ్చరించారు.    స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం లో గురువారం పీసీపీఎన్డీటీ డివిజన్ స్థాయి కమిటీ సమావేశం డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ  అధ్యక్షతన జరిగింది.  ఈ సందర్భంగా డా. ఆశా మాట్లాడుతూ  స్కానింగ్ కేంద్రాలకు గర్భస్థ లింగ  ఆరోగ్య పరిస్థితులు మాత్రమే పరిశీలించి నివేదిక ఇవ్వాలని, లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించకూడదన్నారు.   గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ కేంద్రాల  నిర్వాహకులపై చట్టరీత్య క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.  ఈ చట్టంపై ప్రజలలో విస్తృతంగా అవగాహనా కలిగించాలని, ఇందుకు స్వచ్చంద సంస్థలను కూడా భాగస్వాములను చేయాలన్నారు.  పీసీపీఎన్డీటీ చట్టం వివరాలను ప్రతీ స్కానింగ్ కేంద్రాలలోనూ ప్రదర్శించాలన్నారు.  పీసీపీఎన్డీటీ చట్టం నూజివీడు డివిజన్ లో పటిష్టంగా అమలు చేసేందుకు స్కానింగ్ కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు చేయాలనీ, చట్టాన్ని అతిక్రమించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు.  ఏ స్కానింగ్ కేంద్రమైనా గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గుర్తించినట్లయితే వెంటనే దగ్గరలోని రెవిన్యూ అధికారులకు గాని, లేదా పోలీస్ శాఖ సిబ్బందికి తెలియజేసినట్లైతే వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.  పీసీపీఎన్డీటీ చట్టం  పై ప్రజలలో అవగాహన కలిగించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని డా. ఆశా అధికారులకు సూచించారు.
సమావేశంలో డిఎస్పీ బి. శ్రీనివాసులు, వైద్యాధికారులు డా. నాగేంద్ర సింగ్, డా. అనూష, డా. శ్రీకాంత్, కమిటీ న్యాయ సలహాదారు  కలపాల రామారావు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు జె . సత్యవతి, బి. నగేష్, ప్రభృతులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పరిసరాల పరిశుభ్రత మనఅందరి బాధ్యత..పరిశుభ్రతతోనే ఆరోగ్యం…

-పత్రి ఒక్కరిలో స్వచ్ఛత పై అవగాహన కలిగించాలి.. -స్వచ్ఛత-శుభ్రత పై ప్రజలు నైతిక బాధ్యత వహించాలి.. -మురుగు కాలువగట్లపై చెత్తను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *