అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ రోజు అసెంబ్లీ జీరో అవర్ లో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కొన్ని సమస్యలను ప్రస్తావించారు..
ఐదేళ్ల పాటు అమరావతి రైతుల ఆర్తనాదాలు విన్నాను. వాళ్ల పోరాటంలో నేను సహకరించాను, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటినా ఇప్పటివరకు రైతుల పెండింగ్ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు.. గత అసెంబ్లీ ఈ అంశం పై ప్రశ్నించిన సందర్భంలో ఈ సమస్య చాలా ముఖ్యమైనది కాబట్టి 2 గంటల చర్చ పెడదాము అని స్పీకర్ చెప్పారు. కానీ చర్చ జరగలేదు, సమస్య పరిష్కారం కాలేదు .
రుషికొండ నిర్మాణ విషయంలో ఖర్చు గానీ, పర్యావరణ అనుమతుల్లో చాలా అవకతవకలు జరిగాయి..
ఈమేరకు నేను స్పీకర్ గారికి15 నెలల క్రితమే మూడు పేజీల లేఖ రాశాను..
ఇంకా పాత ప్రభుత్వ వాసనలే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కొనసాగుతున్నాయి.
ఇప్పటికైనా అక్రమార్కుల పై చర్యలు తీసుకోవాలి.. గత ప్రభుత్వ హయాంలో అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను అక్రమంగా విధుల నుంచి తొలగించి, ఎన్నికల నిర్వహణకు విఘాతం కల్గించిన అధికారి సాయి ప్రసాద్ కు ప్రస్తుత ప్రభుత్వంలో ప్రమోషన్ ఇచ్చి కీలక పదవి ఇచ్చినట్లు తెల్సింది.. ఇది వాస్తవమేనా వాస్తవమైతే అతన్ని ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచి చర్యలు తీసుకోవాలి..
Prajavartha Online Telugu News