మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నంను సర్వాంగ సుందర నగరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంగళవారం రాత్రి మంత్రి నగరంలోని 9వ డివిజన్ పరాసుపేట జంక్షన్ లో నూతనంగా నిర్మించిన వాటర్ ఫౌంటెన్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మచిలీపట్నం కార్పొరేషన్ కు నూతన శోభ తీసుకొచ్చేందుకు 2014–19 కాలం నుంచే వివిధ కార్యక్రమాలు చేపట్టామని, నగరంలోని రహదారులకు డివైడర్లు, పచ్చదనం ఏర్పాటు చేశామని మంత్రి గుర్తు చేశారు. పరాసుపేట సెంటర్లో కూడా నాడు వాటర్ ఫౌంటెన్ ఏర్పాటు చేసినప్పటికీ, తర్వాత కాలంలో నిర్లక్ష్యానికి గురైందని, సరిగా పట్టించుకోకపోవడంతో అది మూలన పడిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటర్ ఫౌంటెన్ ను తిరిగి పూర్తిస్థాయిలో ఏర్పాటుకు రూ.8 లక్షలు వెచ్చించి పూల పునాది, విద్యుత్ కాంతులతో సుందరంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దామన్నారు. ఇదే రీతిలో నగరంలోని అన్ని జంక్షన్లలో ఏర్పాటు చేసే విధంగా కార్యాచరణ రూపొందించమన్నారు. అదేవిధంగా జిల్లా పరిషత్తు సెంటర్ వద్ద ఉన్న చెరువును అమృత్ పథకం నిధులతో వాటర్ ఫౌంటెన్ ఏర్పాటు చేసి సుందరంగా తీర్చిదిద్దుతామని, చెరువు చుట్టూత నడక మార్గం ఏర్పాటు చేస్తామన్నారు. అందుకు సంబంధించిన టెండర్లు దశ కూడా చివరికి చేరుకున్నట్లు మంత్ర తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్) ఛైర్మన్ బండి రామకృష్ణ, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని), జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, కూటమి నాయకులు కొనకళ్ళ జగన్నాధ రావు (బుల్లయ్య), పార్టీ టౌన్ ప్రెసిడెంట్ లోగిసెట్టి వెంకట స్వామి, తలారి సోమశేఖర్, కొట్టే వెంకట్రావు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News