Breaking News

అట్టహాసంగా ప్రారంభమైన “ఆటో డ్రైవర్ల సేవలో” కార్యక్రమం

-పశ్చిమ లో సంఘీభావం వ్యక్తం చేసిన ఆటో డ్రైవర్లు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆటో డ్రైవర్ల కోసం కూటమి ప్రభుత్వం “ఆటో డ్రైవర్ల సేవలో” అనే కొత్త పథకానికి శ్రీకారం చుట్టడంతో పశ్చిమ లోని ఆటో డ్రైవర్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సంఘీభావం వ్యక్తం చేశారు 45 వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు మాధురి లావణ్య ఆధ్వర్యంలో సితార ఆటో స్టాండ్,రంగా యూనియన్ ఆధ్వర్యంలో సితార సెంటర్ నుంచి చిట్టినగర్ సర్కిల్ వన్ కార్యాలయం వరకు ఆటో డ్రైవర్లు సంఘీభావం తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, కార్పొరేటర్ మైలవరపు మాధురి లావణ్య ముఖ్య అతిథులుగా పాల్గొని ర్యాలీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మైలవరపు మాధురి లావణ్య మాట్లాడుతూ ఇటీవల స్త్రీ శక్తి పథకం లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్లకు ఆర్థిక వెసులు బాటు కల్పించడానికి “ఆటో డ్రైవర్ల సేవలో” భాగంగా అర్హులైన డ్రైవర్లందరికి రూ 15000 వేల చొప్పున జమ చేసేందుకు సిద్ధమయ్యారన్నారు ఆటో డ్రైవర్లందరి తరపున కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని రంగాల్లో ఆర్థిక ప్రగతిని సాధించిందని కార్పొరేటర్ మైలవరపు మాధురి లావణ్య తెలిపారు. సర్కిల్ వన్ కార్యాలయం లో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ప్రజలందరూ వీక్షించడానికి వీలుగా చిట్టినగర్ సర్కిల్ వన్ కార్యాలయ ఆవరణలో స్క్రీన్ లను ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి అడిషనల్ కమిషనర్ ఎ సీ(పీ) చంద్రశేఖర్, వెస్ట్ స్పెషల్ ఆఫీసర్ రవీంద్రరావు, జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జీ వి ఎస్ ఎన్ మూర్తి, యంగ్ ప్రొఫెషనల్ కాకర్ల ప్రేమ్ దీప్, ఎన్డీఏ కూటమి నేతలు నాగోతి రామారావు, వేంపలి గౌరీ శంకర్, పత్సవ మల్లికార్జున,పోతినిడీ లోకేష్, బెవర మురళి సుజనా మిత్రా కోఆర్డినేటర్లు స్తానిక ప్రజలు పాల్గొని “ఆటో డ్రైవర్ల సేవలో” కార్యక్రమాన్ని వీక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *