రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం ఉదయం స్థానిక ఆర్ట్స్ కళాశాల నుంచి లాలా చెరువు వరకు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై నిర్వహించిన అవగాహన ర్యాలినీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఏ ప్రభుత్వం అయిన పన్నులను పెంచడం తెలుసు గానీ, తగ్గించడం ఎక్కడ చూడలేదు. . పన్నులు తగ్గించాలని ధర్నాలు ఉద్యమాలు చేస్తే ఒకటి లేదా రెండు శాతం తగ్గించే సందర్భాలు మనం చూసాం.. . కానీ కూటమి ప్రభుత్వం 12 , 18 , 28 శాతం ఉన్న పన్నులను ఈ విధంగా తగ్గించడం భారత దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదన్నారు. ప్రభుత్వం రాబడి కోల్పోతున్నా, ప్రజలు ఆనందంగా ఉండాలనే ఆశయం కోసం ఇటువంటి చరిత్రాత్మక మైన నిర్ణయం తీసుకోవడం జరిగిందనీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. రవాణా రంగానికి చెందిన సరుకు రవాణా చేసే వాహనాలు , బస్సులు, మినీ బస్సులు పైన 10 శాతం పన్నులు తగ్గించడం జరిగింది. రైలు, మల్టీమోడల్ వాహనాల రవాణా పై, ట్రాక్టర్ల పై 7 శాతం తగ్గిందన్నారు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పై కూడా ఏడు శాతం పన్నులు తగ్గించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు చూసి ఉండలేదన్నారు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం లో చూడడం కూడా జరగదన్నారు. ఒకవేళ జరుగుతుంది.? అంటే అది ఒక్క కూటమి ప్రభుత్వం వల్ల మాత్రమే సాధ్యం అవుతుందని తెలిపారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని అమలు చేసి, ప్రతి ఆటో డ్రైవర్ కు రూ.15 వేలు ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. గతంలో లక్షల్లో ఉన్న పన్నులను మూడు వేలకి తగ్గించి అది కూడా రెండు వాయిదాల లో చెల్లించే వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను పొందుతూ, మీ మీ రంగం ద్వారా ప్రజలకి సహాయకరంగా నిలవాలని ఎమ్మెల్యే ఆకాంక్ష వ్యక్తం చేశారు ప్రజా ప్రతినిధులతో కలిసి ఇంటింటి ప్రచారం ద్వారా నిత్యవసర వస్తువులు ధరల్లో తగ్గిన వాటి వివరాలు సంబంధించిన అవగాహన కల్పించడం జరుగుతోందని వెల్లడించారు. వాహనాలు ధరలు తగ్గించడం వలన అమ్మకాలు పెరగడం, ప్రజలకి, అన్ని వర్గాల ప్రజలకి ఇంత మొత్తం లో ప్రయోజనం చేకూరుతోందని ఇప్పుడే తెలుసుకోవడం జరిగింది అని పేర్కొన్నారు. రవాణా శాఖ ద్వారా ప్రజలకి జరిగిన మేలును ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం పట్ల ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ద్వారా ప్రజలకి కలుగుతున్న ప్రయోజనాలు అందించే క్రమంలో వ్యాపారస్థులు కూడా ముందుకు రావాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విజ్ఞప్తి చేసారు. ప్రభుత్వం పారదర్శకంగా పరిపాలనా వ్యవస్థ కోసం పని చేస్తోందని , అధికారులు కూడా జవాబుదారీతనం కలిగి ఉండాలని కోరారు. ఇటువంటి అవగాహన కల్పించే కార్యక్రమం లో స్వచ్ఛందంగా భాగస్వామ్యం అయిన కార్మిక సంఘాల ప్రతినిధులకి, కార్మికులకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ మాట్లాడుతూ, జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఎస్ జి ఎస్ ఎస్ పై జిల్లా స్థాయి లో చేపట్టిన అవగాహన ప్రచార కార్యక్రమం లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాను. పన్నులు తగ్గించడం వలన రవాణా రంగంలో, వాటిపై ఆధారపడిన వారికి జరిగే మేలు ను ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రజల్లో కి తీసుకుని వెళ్ళడం జరుగుతోందని పేర్కొన్నారు. ప్రజల్లోకి వెళ్లి, ధరల్లో వచ్చిన వత్యాసాన్ని ప్రజలకి వివరించనున్నట్లు తెలిపారు. ఈ అవగాహనా కార్యక్రమంలో క్రమశిక్షణ తో కలిసి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీపావళి సందర్భంగా రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” అవగాహన కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా పాంప్లెట్‌లు, పోస్టర్లను ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆవిష్కరించి, ప్రజలకు పన్నుల తగ్గింపుతో కలిగే ప్రయోజనాలపై మాట్లాడారు. అనంతరం ఆయన జెండా ఊపి ఆర్ట్స్ కళాశాల నుంచి లాలా చెరువు వరకు నిర్వహించిన వాక్‌థాన్‌కి ప్రారంభం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్, ఎం.వి.ఐలు చింత సంపత్ కుమార్, ఎం. రవికుమార్, ఎ.ఎం.వి.ఐలు పీ.వి.వి.డి. సాయికుమార్, జి. ప్రణీత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News