Breaking News

గోదావరి పుష్కరాల సన్నాహాలు వేగవంతం – ఘాట్ల పరిశీలనలో కలెక్టర్ కీర్తి చేకూరి

-భక్తుల సౌకర్యం, భద్రత, పారిశుద్ధ్యంపై విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశాలు

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న గోదావరి పుష్కరాలు దృష్ట్యా, ఘాట్ల అభివృద్ధి పనులు, సౌకర్యాలు మరియు భక్తుల సురక్షత ఏర్పాట్లపై హేతుబద్ధత విధానంలో ప్రతిపాదనలు సిద్ధం చెయ్యాలనీ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలియ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ “రాజమండ్రి మరియు కొవ్వూరు డివిజన్ పరిధిలోని పుష్కరఘాట్ల వద్ద భక్తుల సౌకర్యం, శుభ్రత, రవాణా, భద్రత అంశాలపై అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆయా శాఖలు ప్రతిపాదించిన పనులనీ అనుసరించి ప్రతి శాఖకు బాధ్యతలను స్పష్టంగా కేటాయించిన మేరకు పుష్కరాలు ప్రారంభం కంటే ముందు ఆయా శాఖలు పనుల పూర్తిచేయాలన్నారు. గురువారం సాయంత్రం కలెక్టర్ పర్యటన నేపథ్యంలో గోష్పాదం క్షేత్రం, కృష్ణచైతన్య ఘాట్, భక్తనాజయ ఘాట్, శివాలయం ఘాట్, పిండ ప్రధానం ఘాట్, క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ ఘాట్, హావ్‌లాక్ బ్రిడ్జ్ ఘాట్, శ్రీనివాస ఘాట్, యెరినమ్మ ఘాట్ తదితర ఘాట్లను పడవ ద్వారా పరిశీలించారు. యెరినమ్మ ఘాట్ నుండి గోష్పాదం ఘాట్ వరకు తిరుగు ప్రయాణం పడవలో నిర్వహించారు. అనంతరం “గోదావరి నీరాజనం” పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సమీక్ష నిర్వహిస్తూ రానున్న గోదావరి పుష్కరాలు దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహించ నున్నట్లు తెలిపారు. పుష్కరాల ఏర్పాట్లపై ఉన్నత స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమీక్షా సమావేశం జరగనున్న నేపథ్యంలో, జిల్లా స్థాయిలో అన్ని విభాగాలు సమన్వయంతో ముందస్తు సన్నాహాలు వేగవంతం చేసే విధానం లో క్షేత్ర స్థాయిలో పరిశీలనా చెయ్యడం జరుగుతోందని వెల్లడించారు. ఈ క్రమంలో కొవ్వూరు, రాజమండ్రి డివిజన్ల పరిధిలోని ప్రధాన ఘాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది అని తెలిపారు. భక్తుల సౌకర్యం, భద్రతా చర్యలు, పారిశుద్ధ్యం, రహదారి మరియు రవాణా సదుపాయాలు, తాగునీరు, విద్యుత్, వైద్య సేవలు తదితర అంశాలపై విభాగాల వారీగా సమీక్షించి, తక్షణమే లోపాలను సరిదిద్దాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పేర్కొంటూ — “పుష్కరాల సమయంలో రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ బృందం కూడా జిల్లాలో పర్యటించే అవకాశం ఉందన్నారు. ప్రతి ఘాట్ వద్ద సదుపాయాలు సమగ్రంగా ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అన్ని శాఖలు సమన్వయం తో పనిచేసి, ఘాట్ల అభివృద్ధి ప్రతిపాదనలు హేతుబద్ధంగా సిద్ధం చేయాలని, పనులను ప్రతిష్ఠాత్మకంగా పూర్తి చేయాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితు లను తెలుసుకునే దిశలో , గోష్పాదం ఘాట్ నుండి కుమారదేవం సినిమా చెట్టు ఘాట్, కుమారదేవం సినిమా చెట్టు ఘాట్ నుండి గండి పోసమ్మ దేవాలయ ఘాట్ వరకు రోడ్డు మార్గంలో ఘాట్ల పరిస్థితిని కలెక్టర్ పరిశీలించారు. రూట్ మ్యాప్ ప్రకారం మొత్తం వివరాలు అధికారులు తెలియ చేశారు.

పర్యాటక శాఖ ప్రాజెక్ట్ పై సమీక్ష:
కొవ్వూరు వద్ద గోదావరి ఒడ్డున పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు నిర్మాణంలో ఉన్న పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టు పురోగతిని అధికారులు కలెక్టర్ కు తెలియ చేయడం జరిగింది. 26 కాటేజీలు, బార్, రెస్టారెంట్, స్విమ్మింగ్ పూల్, కాన్ఫరెన్స్ హాల్ వంటి సౌకర్యాలతో కూడిన ఈ ప్రాజెక్టులో 60% పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు 2027 పుష్కరాలు ప్రారంభానికి ముందే గానే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత, శ్రీవత్స కన్సల్టెంట్స్ బి. కిరణ్, నాయకులు సుబ్బరాయ చౌదరి, స్వరూపనేని చిన్ని, మున్సిపల్ ఏఈ జి. సందీప్, ఇరిగేషన్ ఈఈ జి. శ్రీనివాస్, డి ఈ కే. త్రినాథ్, ఏఈ మణికంఠ, జిల్లా టూరిజం ఆఫీసర్ పి. వెంకటాచలం, ఆర్‌డీ సిహెచ్. పవన్ కుమార్, ఆర్ & బి ఈఈ జి. రూప్ కుమార్ స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *