Breaking News

మొంథా తుఫాను ప్రభావితులకు ప్రభుత్వం అండగా ఉంది

– ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం సమయానుకూలంగా స్పందించింది
– ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు
– ఆర్డీవో రాణి సుస్మిత

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
మొంథా తుఫాను ప్రభావం వల్ల నష్టపోయిన రైతాంగానికి, ప్రజలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటు అందించడం జరుగుతుందని శాసన సభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, ఆర్డీవో రాణి సుస్మిత లు పేర్కొన్నారు. శుక్రవారం కొవ్వూరు మండలంలోని మద్దూరు గ్రామం జెడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో మొంథా తుఫాను బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రభుత్వం తుఫాను ముందస్తు హెచ్చరికల దశలోనే యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం వలన తుఫాను ప్రభావం ఉన్నప్పటికీ ఎటువంటి మానవ, పశు నష్టం జరగకుండా సమర్ధవంతంగా నివారించగలిగామని తెలిపారు.అధిక వర్షాలు, ఈదురు గాలుల కారణంగా కొంత పంట నష్టం సంభవించి నప్పటికీ, జిల్లా యంత్రాంగం వేగంగా స్పందించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిందని తెలిపారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిన ప్రాంతాల్లో తక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా భారీ నష్టం నివారించడమే కాకుండా, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను యుద్ధప్రతిపాదికన చేపట్టారని చెప్పారు. మద్దూరు గ్రామానికి చెందిన 15 కుటుంబాలకు, కొవ్వూరు పట్టణానికి చెందిన 38 కుటుంబాలకు తుఫాను అనంతరం 48 గంటల్లోనే సహాయక చర్యలుగా నిత్యావసర సరుకులు — 50 కేజీలు బియ్యం, ఒక కేజీ కందిపప్పు, ఒక కేజీ పామాయిల్, ఒక కేజీ పంచదార, ఒక కేజీ ఉల్లిపాయలు, ఒక కేజీ బంగాళాదుంపలు పంపిణీ చేయడం జరిగినట్లు ఆయన తెలిపారు. గతంలో ఇంత వేగంగా సహాయక చర్యలు చేపట్టిన ఉదాహరణలు లేవని పేర్కొంటూ, నష్టపోయిన రైతాంగానికి పంటనష్టం అంచనాలు వేయించి, అవసరమైన ఆర్థిక సహాయం అందించే దిశగా చర్యలు జరుగుతున్నాయని తెలిపారు. ఆర్డీవో రాణి సుస్మిత మాట్లాడుతూ, తుఫాను ప్రభావం ప్రారంభమైన నిమిషాలకే తహసీల్దార్లు, గ్రామ సచివాలయ సిబ్బంది, పోలీసులు కలసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారని వివరించారు. వాతావరణ హెచ్చరికలు అందిన వెంటనే పునరావాస కేంద్రాలను సిద్ధం చేసి, ప్రజలకు మౌలిక సదుపాయాలు, ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించామని తెలిపారు. ప్రతి బాధిత కుటుంబానికి అవసరమైన నిత్యావసరాలు అందేలా సమన్వయం చేసామని తెలిపారు. ప్రజలు ఈ తుఫాను సమయంలో ప్రభుత్వం, అధికారులు తమ పట్ల చూపిన స్పందనపై సంతోషం వ్యక్తం చేశారు. సమాచారం అందిన వెంటనే అధికారులు గ్రామాలకు చేరుకోవడం, పునరావాస కేంద్రాలకు తరలించి ఆహారం, వసతి కల్పించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. పునరావాస కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు సక్రమంగా ఉండటం, అధికారులు దగ్గరుండి పర్యవేక్షించడం పట్ల ప్రజలు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నారాయుడు, తహసీల్దార్ ఎమ్ దుర్గా ప్రసాద్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *