Breaking News

త్రాగునీటి సరఫరాకు అంతరాయం…

-ఈ నెల 12 మరియు13 తేదీల్లో నాజ్ సెంటర్, యల్.బి నగర్ మరియు బాలాజీ నగర్ రిజర్వాయర్ల పరిధిలో త్రాగునీటి సరఫరాకు అంతరాయం…… నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్.

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పాలక సంస్ధ పరిధిలోని సంగం జాగర్లమూడి హెడ్ వాటర్ వర్క్స్ నుండి గుంటూరు నగరమునకు క్లియర్ వాటర్ సరఫరా చేయు 700 యమ్.యమ్ డయా ప్రధాన పంపింగ్ లైనుపై సుద్దపల్లి గ్రామం వద్ద లీకు ఏర్పడి త్రాగునీరు వృధా అగుచున్నది. కావున ది. 12.11.2025న సదరు లీకును అరికట్టుటకు నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు లీకు మరమ్మతులు నిర్వహించుటకు నిర్ణయించుట జరిగినది. కావున ది. 12.11.2025 బుధవారం ఉదయం 8 గంటల నుండి సంగం జాగర్లమూడి ఫిల్టరేషన్ ప్లాంటు పూర్తిగా నిలుపుదల చేయుచున్నారు. అందువలన ది. 12-11-2025 బుధవారం సాయంత్రం మరియు 13-11-2025 గురువారం ఉదయం పట్టణములోని ఈ క్రింది తెలిపిన ప్రాంతముల యందు నగరంలో తూర్పు నియోజకవర్గంలోని పరిధిలోని కొన్ని ప్రాంతాలలో త్రాగు నీటి సరఫరాకు అంతరాయము ఏర్పడును. నగర పాలక సంస్థ పరిధిలో గల నాజ్ సెంటర్, యల్.బి నగర్, బాలాజి నగర్ రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతములలో ది. 12.11.2025న బుధవారం సాయంత్రం మరియు 13-11-2025 గురువారం ఉదయం త్రాగునీటి సరఫరా అంతరాయము ఏర్పడును. కావున నగర ప్రజలు గుంటూరు నగరపాలక సంస్ధకు సహకరించి ముందుగా తగిన ఏర్పాట్లు చేసుకొనవలసినదిగా కోరడమైనది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *