గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పేద ప్రజలకు, రోజువారీ కార్మికులకు అతి తక్కువ ఖర్చుతో ఆహారాన్ని అందిస్తున్న అన్న క్యాంటీన్ల శుభ్రత, సమయపాలన పాటించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అధికారులు, నిర్వాహకులను ఆదేశించారు. సోమవారం కమిషనర్ ఆర్టీఓ ఆఫీస్ సమీపంలోని అన్న క్యాంటీన్‌ను పరిశీలించి, భోజనం తీసుకుంటున్న వారితో మాట్లాడి ఆహారం నాణ్యత, రుచిపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. పరిసరాల శుభ్రతను పరిశీలించి, శుభ్రతను కాపాడాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన, శుభ్రమైన ఆహారం అందించడంలో ఎటువంటి రాజీ ఉండకూడదన్నారు. అన్న క్యాంటీన్లు పేదల మరియు కార్మికులకు ఆహారాన్ని కేవలం రూ.5కే అందిస్తున్నాయన్నారు. ప్రతి క్యాంటీన్‌ను శుభ్రంగా ఉంచి, సమయానికి భోజనం అందించాన్నారు. అలాగే క్యాంటీన్ వద్ద మౌలిక వసతులను మెరుగుపరచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ విభాగాధికారులను ఆదేశించారు.
Prajavartha Online Telugu News