Breaking News

ప్రజల సంతృప్తి స్థాయి మెరుగుపడాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రజలు నుంచి వివిధ శాఖలకు అందించిన ఫిర్యాదు అర్జీలను దరఖాస్తుదారుల సంతృప్తి స్థాయిని మెరుగుపరిచేలా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సూచించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఎస్ ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి , డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మి కుమారి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ శాఖలకు సంబంధించి 261 అర్జీలు ప్రజలు అందించగా, వీటిని పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు అందించిన అర్జీలను క్షేత్రస్థాయిలో సక్రమంగా విచారించి పరిష్కరించాలని తెలిపారు. దరఖాస్తుదారులకు నిర్దేశిత మార్గదర్శకాలను పాటిస్తూ కచ్చితంగా ఎండార్స్ మెంట్ ఇవ్వాలని తెలిపారు. అధికారులు ముఖ్యమైన అంశాలకు సంబంధించి జాబితాను తయారు చేసుకోవాలని పై అధికారులు అడిగినప్పుడు వెంటనే స్పందించేలాగా ఉండాలన్నారు. పెండింగ్ లో వున్న సి.ఏం.ఓ. గ్రీవెన్స్ ను వెంటనే పూర్తి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో పిడి డీఆర్ డీఏ విజయలక్ష్మి , జిల్లా విద్యాశాఖాధికారి రేణుక , పశుసంవర్ధక శాఖ జె డి ఏ సత్యనారాయణ, జిల్లా ఉపాధి అధికారి దుర్గాబాయి, లీడ్ బ్యాంకు మేనేజర్ మహిపాల్ రెడ్డి, ఏడి మైక్రోఇరిగేషన్ వజ్రశ్రీ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ చక్రవర్తి, కలక్టరేట్ ఎఒ పూర్ణ చంద్రరావు, కలెక్టరేట్ హెచ్ సెక్షన్ సుపరింటీండెంట్ మల్లేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *