Breaking News

“ట్రాన్సఫర్మేటివ్ జస్టిన్” పుస్తకాన్ని అవిష్కరించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జస్టిస్ డా.బులుసు శివ శంకర్రావు వ్రాసిన “ట్రాన్సఫర్మేటివ్ జస్టిన్” పుస్తకాన్ని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి గురువారం ఆవిష్కరించారు. మంగళగిరి ఎ.పి.ఐ.ఐ.సి. టవర్సులో జరిగిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి మాట్లాడుతూ జస్టిస్ డా.బులుసు శివ శంకర్రావు రచించిన పుస్తకానికి పెట్టిన పేరున బట్టే రచయిత యొక్క మేథోసంపత్తి, క్రిమినల్ జస్టిస్ పై ఆయనకు ఉన్న అవగాహనను వ్యక్తపరుస్తుందన్నారు. క్రిమినల్ జస్టిస్ డెలివరీ విదానంలో ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న పలు మార్పులు, సంస్కరణలకు అనుగుణంగా పలు కోణాల్లో ఎంతో పరిశోదాత్మకంగా వివరిస్తూ జస్టిస్ డా.బులుసు శివ శంకర్రావు “ట్రాన్సఫర్మేటివ్ జస్టిన్” పుస్తకాన్నిరచించారని అభినందించారు. భవిష్యత్తు తరాల లీగల్ ఫ్రటర్నిటీకి ఈ పుస్తకం ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని ఆయన అబిలషించారు. లీగల్ ప్రటర్నిటీకి ఉపయోగ పడే విధంగా డా.బులుసు శివ శంకర్రావు గతంలోకూడా కొన్నిపుస్తకాలు రచించారని, భవిష్యత్తులో కూడా మరిన్ని పుస్తకాలు రచించాలని ఆకాంక్షించారు.
న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ, జస్టిస్ రఘునందనరావు, జస్టిస్ దుర్గాప్రసాద్ రావు, జస్టిస్ శేషసాయి తదితరులు ఈ సమావేశంలో మాట్లాడుతూ జస్టిస్ డా.బులుసు శివ శంకర్రావు రచించిన పుస్తకం “ట్రాన్సఫర్మేటివ్ జస్టిన్” న్యాయ వ్యవస్థకు ప్రత్యేకించి న్యాయ విద్యార్థులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని ప్రశంశించారు.
ఏ.జి. శ్రీరామ్, హైకోర్టు బార్ అసోషియేషన్ అద్యక్షులు వై.వి.రవిప్రసాద్, రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ అనంతరామారావు, రిటైర్టు న్యాయ మూర్తులు, న్యాయవాదులు, జ్యుడీషియల్ అధికారులు, సిబ్బంది పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *