Breaking News

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన మంత్రి కందుల దుర్గేష్

-సేవకు ప్రతిరూపంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబాను అభివర్ణించిన మంత్రి కందుల దుర్గేష్

పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త :
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తి విచ్చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి మంత్రి కందుల దుర్గేష్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురూ ఆత్మీయంగా పలకరించుకున్నారు. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవోపేతంగా పుట్టపర్తి లోని హిల్ వ్యూ ఆడిటోరియంలో నిర్వహించిన బాబా శతజయంతి వేడుకల్లో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఈ సందర్భంగా ప్రపంచ మానవాళికి సత్య సాయి బాబా బోధించిన ప్రవచనాలను, ఆయన గత స్మృతులను స్మరించుకున్నారు. బాబా సూచించిన ఆధ్యాత్మికత, శాంతి సందేశాలను, సామాజిక సేవలను గుర్తు చేసుకున్నారు. తాను ఈ శతజయంతి ఉత్సవంలో భాగస్వామిని కావడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. సేవకు ప్రతిరూపంగా భగవాన్ శ్రీ సత్య సాయి బాబాను అభివర్ణించారు. ప్రపంచ శాంతికి పాటు పడదామని పిలుపునిచ్చారు. ఈ శతజయంతి వేడుకలకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీలో సభ్యుడైన మంత్రి కందుల దుర్గేష్ గత నాలుగు రోజులుగా ఉత్సవ ఏర్పాట్లను దగ్గరుండి స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పలువురు అతిథులకు ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వం తనకు కేటాయించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *