త్రిబుల్ ఐటీ ప్రవేశ పరీక్ష ను ఆకస్మిక తనిఖీ చేసిన ఆర్డీఓ…

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గన్నవరంలోని జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్ లో ఆదివారం నిర్వహించిన త్రిబుల్ ఐటీ లో ప్రవేశం కోసం నిర్వహిస్తున్న ఎంట్రన్స్ టెస్ట్ ను రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలోని ప్రతిభ కలిగిన విద్యార్థినీ విద్యార్థులకు ఉన్నతస్థాయి విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన త్రిబుల్ ఐటీ విద్యా సంస్థలను ఏర్పాటు చేసిందని, అటువంటి విద్యా సంస్థలలో ప్రవేశానికి నిర్వహిస్తున్న పరీక్షను ఎంతో పకడ్బందీగా నిర్వహించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పరీక్ష రాస్తున్న విద్యార్థుల సంఖ్య, పరీక్ష ఏర్పాట్లను గురించి అధికారులను అడిగి తెలుసు కున్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్ష ఏర్పాట్లలో కొవిడ్ నిబంధనలను తప్పకుండా పాటించాలన్నారు. పరీక్షా కేంద్రంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడంపై ఆర్డీఓ సంతృప్తిని వ్యక్తం చేసారు. హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆదివాసి దినోత్సవం రోజున గిరిజన యువకుని జీవితంలో కొత్త వెలుగులు_

-కక్ష సాధింపుతో కాలిపోయిన ఆటో… మానవత్వంతో వెలిగిన కొత్త జీవితం -జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబానికి మళ్లీ ఉపాధి బాట చూపిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *