Breaking News

నేడే జాబ్ మేళా

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశముల మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి కృషి చేస్తున్నది. దీనిలో భాగముగా నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ మేళాలు నిర్వహించి ఉద్యోగ అవకాశం కల్పించడం జరుగుతుంది.
గుంటూరు జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి కొండా సంజీవరావు మాట్లాడుతూ గౌరవ శాసనసభ్యులు గుంటూరు తూర్పు నియోజకవర్గం మహమ్మద్ నజీర్(MLA) ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ, ఆధ్వర్యంలో ఈ నెల 03-12-2025వ తేదీన అనగా రేపు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఆంధ్రా ముస్లిం కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా గుంటూరు జిల్లా లో ఉన్న యువతి యువకులు ఈ జాబ్ మేళా నందు పాల్గొని ఉద్యోగ అవకాశాలు పొందవలసిందిగా కోరుచున్నాము
ఈ జాబ్ మేళా కు SSC, ITI లేదా గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొందిన 18-35 సం||ల వయసు గల నిరుద్యోగ యువకులు వారి యొక్క బయోడేటా లేదా రెస్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ జిరాక్స్, ఆధార్ నకలు మరియు పాస్ పోర్ట్ ఫోటో తో నేరుగా ఇంటర్వ్యూ కు హాజరు కాగలరు.
చిరునామా:
తేదీ : 03-13-2025
సమయం : ఉదయం 10:00 నుండి సాయంత్రం 04:00 వరకు ఇంటర్వూలు జరుగును.
స్థలం : ఆంధ్రా ముస్లిం కళాశాల, గుంటూరు – పొన్నూరు రోడ్డు, గుంటూరు
సంప్రదించవలసిన నంబర్లు :- నరేష్ డి ని 986-636-6187 లేదా కృపానందం ఎన్ ని 958-179-4605 నంబర్లలో సంప్రదించండి.
ఔత్సాహిక యువతి యువకులు ముందుగా https://naipunyam.ap.gov.in/ అనే వెబ్ సైట్ నందు రిజిస్టర్ చేసుకోగలరు. మరిన్ని వివరములకు టోల్ ఫ్రీ నంబర్: 9988853335, 8712655686, 8790118349, 8790117279 మరియు పైన తెలిపిన నంబర్లను సంప్రదించగలరు. గమనిక: రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోనటువంటి యువతీ యువకులు జాబ్ డ్రైవ్ జరుగు ప్రదేశం నందు రిజిస్ట్రేషన్ సుకోవచ్చు అని గమనించగలరు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *