Breaking News

14 మినీ అంగన్వాడి కేంద్రాలను మెయిన్ అంగన్వాడి కేంద్రాలుగా అప్ గ్రేడేషన్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని 14 మినీ అంగన్వాడి కేంద్రాలను మెయిన్ అంగన్వాడి కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేస్తూ మంగళవారం జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా సెలక్షన్ కమిటీ సమావేశంలో ఆమోదించారు. జిల్లాలో మినీ అంగన్వాడి కేంద్రాలను మెయిన్ అంగన్వాడి కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేయుటకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అప్ గ్రేడ్ చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో నిర్దేశిత మార్గదర్శకాలు ప్రకారం హెల్పర్స్ నియామకానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఐ సి డి ఎస్ పిడీ ప్రసూన, డిఇఓ రేణుక, డిఎంహెచ్ఓ డా. విజయలక్ష్మి, సిడిపివోలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *