గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నల్లబర్లీ పొగాకు సాగును ప్రభుత్వం నిషేధించిందని, రైతులు ఎవరు నల్లబర్లీ సాగు చేయవద్దని జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి తెలిపారు. మండల టాస్క్ఫోర్స్ టీం మరియు ఆర్ఎస్కే సిబ్బంది ద్వారా నల్ల బర్లి సాగు చేయరాదని శిక్షణా కార్యక్రమాలు, కరపత్రాలు పంపిణీ, వివిధ మాధ్యమాల ద్వారా రైతులకు తెలియపరచినప్పటికీ ఇంకా కొంతమంది రైతులు నల్ల బర్లీ సాగు చేస్తున్నారు అని సమాచారం అందడంతో గురువారం పెదనందిపాడు మండలం వరగాని, ప్రత్తిపాడు మండలం మల్లాయపాలెం గ్రామాల్లో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ పర్యటించి రైతుల పేర్లను సేకరించి జిల్లా టాస్క్ ఫోర్స్ టీంకు పంపించడం జరుగుతుందని వారు తీసుకునే చర్యలు కు బాధ్యులు అవుతారని తెలిపారు. ఎవరు కూడా నల్లబర్లీ పొగాకు సాగు చేయరాదని రైతులకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మార్క్ పెడ్ మేనేజర్ నరసింహారెడ్డి, గుంటూరు సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్ మోహన్ రావు మోహన్ రావు, మండల తహసిల్దార్ హేనప్రియా రైతులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News