Breaking News

జెన్ జెడ్ పోస్ట్ ఆఫీస్ గా వి.ఐ.టి సబ్ పోస్ట్ ఆఫీస్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు పోస్టల్ డివిజన్ లో విట్ (VIT-AP) సబ్ పోస్ట్ ఆఫీస్ ను ఆధునీకరణ చేసి జెన్ జెడ్ (Gen ‘Z’) పోస్ట్ ఆఫీస్ గా చేయడం జరిగిందని పోస్టల్ సూపరింటెండెంట్ మధుర వాణి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పోస్ట్ ఆఫీస్ ను శనివారం ఉదయం10 గంటలకు కేంద్ర గ్రామీణ అభివృద్ధి మరియు కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ VIT University క్యాంపస్ లో ప్రారంభిస్తారన్నారు. తాడికొండ శాసన సభ్యులు తెనాలి శ్రవణ్ కుమార్ , ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బి.పి శ్రీదేవి, విట్ వైస్ ఛాన్సలర్ డా. పి అరుల్ మాజీవర్మన్, జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, విట్ రిజిస్ట్రార్ ఎం.జగదీష్ చంద్ర, విజయవాడ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ డా. వి. ఉపేందర్, తపాలా శాఖ అధికారులు పాల్గొంటారని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *