Breaking News

నూత‌న సంవత్స‌రంలో మ‌రింత ఉత్సాహంగా ప‌ని చేద్దాం

-న్యూ ఇయ‌ర్ క్యాలెండ‌ర్ ఆవిష్క‌రించిన ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నాయ‌క‌త్వంలో నూతన సంవత్సరంలో మ‌రింత ఉత్సాహంతో పనిచేసి స్వ‌ర్ణాంధ్ర 2047, విక‌సిత్ భార‌త్ 2047 సాధ‌న‌కు కృషి చేయాల‌ని ఎంపీ కేశినేని శివ‌నాథ్ అన్నారు. తిరువూరు నియోజ‌క‌వ‌ర్గం ఏ.కొండూరు మండలం చీమలపాడు నీటి సంఘం అధ్యక్షుడు పాగాల ఆంజనేయులు గౌడ్ (అంజి) రూపొందించిన 2026 క్యాలెండర్‌ను ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) విజయవాడ పార్లమెంట్ కార్యాలయంలో మంగ‌ళ‌వారం ఆవిష్కరించారు. అనంత‌రం నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజ‌య్ వ‌ర్మ‌, టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు ప‌రుచూరి ప్ర‌సాద్, ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి అర్బ‌న్ కో-ఆర్డినేట‌ర్ వ‌ల్ల‌భ‌నేని న‌ర‌సింహాచౌద‌రి, ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి రూర‌ల్ కో-ఆర్డినేట‌ర్ జి.వి.న‌ర‌సింహారావు, టిడిపి నాయ‌కులు కిలారి చంద్ర‌శేఖ‌ర్, మాదిగాని గురునాథం, డాక్టర్ సంకె విశ్వనాథం, చీమ‌ల‌పాడు గ్రామ‌ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొండిపాటీ సుబ్బారావు, సెక్రటరీ స్టాలిన్, మాజీ సర్పంచ్ తిరుపతి రావు, టీడీపీ సీనియర్ నాయకులు ఏ. రవి చౌదరి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఎస్.కే. కరీముల్లా, గాలిషా రత్తయ్య ల‌తోపాటు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *