Breaking News

నిర్ణీత గడువులో పరిష్కార మార్గం చూపడంలో పూర్తి బాధ్యత వహించాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా స్వీకరించిన అర్జీలు, అలాగే రెవెన్యూ క్లినిక్‌లో అందిన అర్జీలను సంబంధిత అధికారులు శ్రద్ధతో స్వీకరించి, నిర్ణీత గడువులో పరిష్కార మార్గం చూపడంలో పూర్తి బాధ్యత వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామ మూర్తి స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ @ లో PGRS మరియు రెవెన్యూ క్లినిక్లను రెండు వేదికల ద్వారా నిర్వహించి అర్జీలను స్వీకరించడం జరిగింది. కలెక్టరేట్ లో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్‌లో మొత్తం 129 దరఖాస్తులు అందగా, వీటిలో *హక్కుల రికార్డు (RoR)*కు సంబంధించి 50, రీ-సర్వేలో ఫిర్యాదులు 26, 22(A) నుండి తొలగింపు అభ్యర్థనలు 10, రీసర్వే (SSLR), భూసేకరణపై ఫిర్యాదులు చెరో 9, ఇతరాలు, ఆక్రమణలు చెరో 6, నమోదు సేవలు 3, F రేఖలు (సరిహద్దు సమస్యలు) 2, అలాగే భూసేకరణ సమస్యలు, ఇనామ్స్, లంక భూముల సమస్యలు, రెవెన్యూ అధికారులపై ఫిర్యాదులు, వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చడం (ఒకేసారి పరిష్కారం), ప్రభుత్వ భూముల సరిహద్దుల నిర్ధారణ, GSWS/మీసేవా (ఆదాయం) ఫిర్యాదులు ఒక్కొక్కటి చొప్పున ఉన్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో మొత్తం 227 అర్జీలు స్వీకరించగా, వాటిలో శాఖల వారీగా పరిశీలిస్తే రెవెన్యూ – రెవెన్యూ క్లినిక్‌కు 129, పంచాయత్ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి 44, హోమ్ శాఖ 20, మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్ల శాఖ, వ్యవసాయం మరియు సహకారం, రవాణా, రోడ్లు మరియు భవనాలు, పర్యావరణం, అటవీ, శాస్త్ర మరియు సాంకేతికత శాఖలకు , ఫైనాన్స్ , పశుసంవర్ధక–పాడి పరిశ్రమ అభివృద్ధి–మత్స్య శాఖ, పరిశ్రమలు మరియు వాణిజ్యం, ఆరోగ్యం, వైద్యం మరియు కుటుంబ సంక్షేమం తదితర శాఖలకు చెందిన 34 అర్జీలు అందినట్లు వెల్లడించారు.

కొన్ని అర్జీదారుల సమస్యలు .
మండపేట మండలానికి చెందిన కంకటాల మురళీకృష్ణ వేములపల్లి (ద్వారంపూడి) బస్టాండ్‌లోకి ఆర్టీసీ ప్రైవేట్ అద్దె బస్సులు రావడం లేదని అర్జీ అందజేయగా, రంగంపేట మండలం జి.దొంతమూరు గ్రామానికి చెందిన ఎం. విష్ణుమూర్తి సర్వే నంబర్ 129/3ఏ లోని వ్యవసాయ భూమికి సంబంధించి అన్నదాత సుఖీభవ నిధులు రెండు విడతలుగా జమ కాలేదని ఫిర్యాదు చేశారు. పెరవలి మండలం ముక్కామాల గ్రామానికి చెందిన ఎన్. సత్యనారాయణ రీ-సర్వే అనంతరం తన భూమిలో 9 సెంట్లు తక్కువగా చూపించారని, చాగల్లు మండలం గౌరిపల్లి గ్రామానికి చెందిన టి.ఆర్.కే. రత్నజీ రావు ఆర్.ఎస్. నంబర్ 220/1, 225/1లలో భూమి కొలతలు తక్కువగా చూపించారని సరిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో PGRS అర్జీలను జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామ మూర్తి, ఇతర జిల్లా అధికారులు స్వీకరించగా, రెవెన్యూ క్లినిక్ అర్జీలను జిల్లా కలెక్టరేట్ పరిపాలన అధికారి మహ్మద్ అలీ, ఎస్‌డీసీ భాగ్యవతి తదితర రెవెన్యూ అధికారులు, సిబ్బంది స్వీకరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *