-ముగ్ద స్టూడియోను ప్రారంభించిన హోంమంత్రి మేకతోటి సుచరిత,సినీ తారలు శ్రీయ, ఫరియా అబ్దుల్లా…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళలు మెచ్చేవిధంగా ముగ్ద ఆర్ట్ డిజైనర్ షోరూమ్ ఉంటుందని హోంమంత్రి మేకతోటి సుచరిత అభిప్రాయపడ్డారు.శుక్రవారం బందరు రోడ్డు లోని ముగ్ద ఆర్ట్ డిజైనర్ స్టూడియో ను హోంమంత్రి మేకతోటి సుచరిత సినీతారలు శ్రీయ, ఫరియా అబ్దులా లు ప్రారంభించారు.ఈ సందర్భంగా హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ పెరుగుతున్న మానవ అవసరాల్లో వస్త్రాలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు.
నగరంలో సువిశాలంగా ముగ్ద ఆర్ట్ డిజైనర్ స్టూడియో ను ప్రారంభించారన్నారు.ఆర్ట్ డిజైనర్ వంగపల్లి శశి సాధారణ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చి వ్యాపార రంగంలో స్థిరపడ్డారని, హైదరాబాద్ లో అద్భుతమైన డిజైనర్ గా మంచి పేరు తెచ్చుకున్నారన్నారు.ఈ స్టూడియో లో సాంప్రదాయ, ఆధునిక వస్త్రాలు మహిళలు మెచ్చే విధంగా ఉన్నాయని తెలిపారు.
ప్రముఖ నటి శ్రియ మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత విజయవాడ రావటం చాలా సంతోషంగా ఉందని, దుర్గమ్మ దర్శనం బాగా జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు.తనకు చీరలు అంటే చాలా ఇష్టమని, చిన్నప్పటి నుండి చీరలన్నీ కలెక్షన్ చేస్తున్నానని వివరించారు.ముగ్ద ఆర్ట్స్ డిజైనర్ కలెక్షన్స్ అంటే తనకు చాలా ఇష్టమని, ఈ షోరూం డిజైన్ టెంపుల్ ను తలపిస్తోందని అన్నారు.రాబోయే చిత్రం ఆర్.ఆర్.ఆర్ లో అజయ్ దేవగన్ భార్యగా చేశానని, అలాగే దృశ్యం 2లో కూడా మంచి పాత్రను చేస్తున్నానని తెలిపారు.
మరో నటి జాతి రత్నాలు సినీ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ ముగ్దా లో టెంపుల్ లాగా సాంప్రదాయబద్ధంగా చూడచక్కటిగా ఆహ్లాదకరంగా ఉందన్నారు. ముగ్ద కలెక్షన్స్, ఫ్యాషన్స్ చాలా బాగుంటాయని వివరించారు.తనకు జాతిరత్నాలు సినిమా మంచి పేరు తెచ్చిందని త్వరలో మంచి చిత్రాలను చేస్తున్నట్లు వెల్లడించారు.
అనంతరం ప్రముఖ డిజైనర్ శశి వంగపల్లి మాట్లాడుతూ విజయవాడలో ముగ్ద ఆర్ట్ డిజైనర్ స్టూడియో అందుబాటులో తీసుకువచ్చామని తెలిపారు. ముగ్దా లో కొనుగోలు చేయడానికి చాలామంది విజయవాడ సుదూర ప్రాంతాల నుండి హైదరాబాద్ కు వచ్చేవారని, ఇక్కడ నగరంలో తమ కలెక్షన్ కు చాలా మంది అభిమానులు ఉన్నారని ఈ మేరకు ముగ్ద స్టూడియో ను విజయవాడ ప్రారంభించినట్లు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే విష్ణు తదితర నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News