Breaking News

విబి జి రామ్ జి కార్మికుల వేతనాలపై స్పష్టత కోరిన తిరుపతి ఎంపీ గురుమూర్తి

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త:
వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ్ (విబి జి రామ్ జి) పథకం కింద గ్రామీణ కార్మికులకు అందించే వేతనాలు, పథక అమలుకు సంబంధించిన పలు అంశాలపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పార్లమెంటులో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్ సమాధానం ఇచ్చారు.

విబి జి రామ్ జి చట్టం 2025లోని సెక్షన్ 10 ప్రకారం, ఈ పథకానికి సంబంధించిన వేతన రేట్లను కేంద్ర ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ ద్వారా ప్రకటించే అధికారం కలిగి ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విధంగా ప్రకటించే వేతనాలు సంబంధిత రాష్ట్రాలు, జిల్లాల్లో అమలులో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్ఆర్ఇజిఎస్) ఇస్తున్న వేతనాల కంటే తక్కువగా ఉండకూడదని చట్టంలోనే స్పష్టంగా పేర్కొనబడిందన్నారు.

అలాగే, విబి జి రామ్ జి పథకం కింద ప్రత్యేకంగా వేతనాలు నోటిఫై చేసే వరకు ప్రస్తుతం అమలులో ఉన్న ఎంజిఎన్ఆర్ఇజిఎస్ వేతనాలే వర్తిస్తాయని తెలిపారు. గ్రామీణ కార్మికులకు వేతనాల చెల్లింపులో ఎలాంటి ఆలస్యం జరగకుండా, వారానికి ఒకసారి లేదా ఎట్టి పరిస్థితుల్లోనూ 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించాలనే నిబంధనను చట్టం కల్పించిందన్నారు.

మస్టర్ రోల్ పూర్తయిన తేదీ నుంచి 15 రోజుల్లో వేతనాలు చెల్లించకపోతే, ఆలస్యానికి పరిహారం పొందే హక్కు కార్మికులకు ఉంటుందని కూడా చట్టంలో స్పష్టంగా పొందుపరచినట్లు మంత్రి వివరించారు. ఈ విధంగా విబి జి రామ్ జి పథకం ద్వారా గ్రామీణ కార్మికులకు వేతన భద్రత, పారదర్శకత, సమయపాలన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన ఏర్పాట్లు చేసిందని ఆయన వెల్లడించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *