Breaking News

ప్రజా ప్రతినిధులకు మార్చి 5నుండి 7 వరకు మూడు రోజుల పాటు క్రీడాపోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అసెంబ్లీ సమావేశాల్లో ఆటవిడుపుగా ప్రజాప్రతినిధులకు క్రీడాపోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదేశించారు. ప్రజా ప్రతినిధులకు క్రీడాపోటీల నిర్వహణపై సన్నద్ధతపై మంగళవారం స్పీకర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజుల పాటు జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలకు మార్చి 5,6,7 తేదీల్లో క్రీడాపోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వారికి ఆటవిడుపు కలిగించాలని క్రీడలు, సాంస్కృతిక విభాగాల అధికారులకు సూచించారు. క్రీడా పోటీల విభాగంలో పాల్గొనటానికి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆసక్తి కనపర్చుతున్నారని, అంతేకాకుండా సాంస్కృతిక కార్యక్రమంలో కూడా పాల్గొనడానికి ఉత్సుకత చూపుతుండటం హర్షనీయమని అన్నారు.

క్రీడల ఈవెంట్ నిర్వహణనకు శాసన సభ, శాసన మండలి చీఫ్ విప్ లు, విప్ లతో ఒక కమిటీ వేయాలన్నారు. అలాగే మూడు రోజుల పాటు నిర్వహించే ప్రజాప్రతినిధుల నిర్ణయించిన మూడు రోజుల్లో క్రీడాపోటీలను మధ్యాహ్నం నుండి జరపాలన్నారు. అలాగే కల్చరల్ కార్యక్రమాలు చివరి రోజు సాయంత్రం నుండి అహ్లాదవాతావరణంలో నిర్వహించేలా కల్చరల్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలకు ఈ సారి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ కుటుంబ సభ్యులతో హజరు కావాలని కోరనున్నామని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు చెప్పారు.

*నిర్వహించనున్న క్రీడల వివరాలు* :
అద్లెటిక్స్ విభాగంలో పరుగు పందెం, క్యారమ్స్, చెస్, బాడ్మింటన్, టెబుల్ టెన్నిస్, టెన్నీకాయిట్, క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, త్రోబాల్, టగ్ ఆఫ్ వార్, పికిల్ బాల్ పోటీలు నిర్వహించాలని ప్రాథమికంగా శాప్ అధికారులు అధికారులు స్పీకర్ అయ్యన్న పాత్రుడి దృష్టికి తీసుకువచ్చారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా స్కిట్స్, ట్రాక్ సింగింగ్ తదితర వీక్షకులను అలరించేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ క్రీడాపోటీలను, సాంస్కృతిక కార్యక్రమాలను ఉత్సాహభరిత, ఉల్లాసభరిత వాతావరణంలో నిర్వహించాలన్నారు.
ఈసమావేశంలో ఉప సభాపతి కె. రఘురామ కృష్ణరాజు, రవాణా, యువజన మరియు క్రీడాశాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, విప్ యార్లగడ్డ వెంకట్రావ్, శాసన మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, ఎమ్మెల్యే కూన రవికుమార్, శాప్ ఛైర్మన్ అనిమిని రవి నాయుడు, ఏపీ శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర,డైరక్టర్ ఫర్ కల్చర్ మల్లిఖార్జునరావు, శాప్ ఎండీ భరణి తదితరులు పాల్గొన్నారు.

(సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ సచివాలయం వారిచే జారీ)

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *