Breaking News

ఏపీ పర్యాటక సంస్థ 50 ఏళ్ల వేడుకల సందర్భంగా ‘లోగో’ డిజైన్ పోటీలకు ఆహ్వానం….

-పర్యాటకశాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పద్మావతి

​అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (APTDC) స్థాపించబడి 50 వసంతాలు పూర్తవుతున్న శుభసందర్భాన్ని పురస్కరించుకుని, ఫిబ్రవరి 18వ తేదీ నుండి గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా ప్రారంభం కానున్నాయన్నారు. వేడుకల కోసం ప్రత్యేకంగా రూపొందించే ‘APTDC@50’ లోగో డిజైన్ల కోసం ప్రతిభావంతులైన రూపకర్తల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పర్యాటక శాఖ ఈ.డీ. (ఆపరేషన్స్) ఏ.ఎల్. పద్మావతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ పర్యాటక వైభవాన్ని చాటిచెప్పేలా 50 ఏళ్ల వేడుకల (APTDC@50) లోగో ఉండాలన్నారు.నిపుణుల కమిటీ ద్వారా ఎంపికైన ఉత్తమ లోగోకు రూ. 20,000/- (ఇరవై వేల రూపాయలు) నగదు పారితోషికంతో పాటు అధికారిక సత్కారం ఉంటుందన్నారు.
​ఆసక్తి కలిగిన వారు తమ డిజైన్లను ఈనెల (ఫిబ్రవరి) 14వ తేదీ సాయంత్రం 5గంటలలోపు
​​gmmktg@aptdc.in,
jayahobharathiyam@gmail.com మెయిల్ అడ్రస్‌లకు పంపవలసి ఉంటుందన్నారు.
​స్వర్ణోత్సవ వేడుకలను రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలలో ప్రతి నెల ఒక వేదిక చొప్పున ఏడాది పొడవునా వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. లోగో డిజైన్ పోటీలో కళాకారులు, డిజైనర్లు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పర్యాటక శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) ఏ.ఎల్. పద్మావతి ఆ ప్రకటనలో కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *