Breaking News

రంజాన్ ఉపవాస ప్రార్ధనలకు జియంసి నుండి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రంజాన్ ఉపవాస ప్రార్ధనలకు జియంసి నుండి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర నగర పాలక సంస్థ అధికారులను ఆదేశించారు. బుధవారం మేయర్ ఛాంబర్ లో ఈ నెల 19 నుండి ప్రారంభం కానున్న రంజాన్ ఉపవాస ప్రార్ధనలలో ముస్లిం సోదరులకు ఇబ్బందులు లేకుండా చేపట్టాల్సిన చర్యల పై జియంసి అధికారులతో మేయర్ ఛాంబర్ లో సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, పవిత్ర రంజాన్ మాసాన్ని దృష్టిలో ఉంచుకొని గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని మసీదుల వద్ద ప్రత్యేకంగా పారిశుధ్య పనులు, రోడ్ల మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాట్లను త్వరితగతిన చేపట్టాలన్నారు. మసీదుల వద్ద రంజాన్ మాసం ముగింపు వరకు విద్యుత్ అంతరాయం రాకుండా, త్రాగునీటి యద్దడి లేకుండా చూడాలన్నారు. అవసరమైన ప్రాంతాలలో వైద్య ఆరోగ్య విభాగం ద్వారా మెడికల్ క్యాంపుల ఏర్పాటు, జియంసి లో కంట్రోల్ ఏర్పాటు వంటి అంశాల పై కూడా ద్రుష్టి సారించాలని అధికారులకు సూచించారు. హలీం సెంటర్ల వద్ద కూడా పారిశుధ్యాన్ని పర్యవేక్షించాలని, రంజాన్ నెలను కూటమి ప్రభుత్వం, ప్రత్యేకించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారన్నారు. నెల రోజుల పాటు జరిగే ఉపవాస ప్రార్ధనల సమయంలో ముస్లిమేతరులు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా ముస్లింల మనోభావాలు దెబ్బతినకుండా వారికి సహకరించాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *