Breaking News

AI Conclave లో మెరిసిన ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్కరణలు

-అభినందించిన కేంద్ర విద్యా శాఖ, నైపుణ్య అభివృద్ధి, వ్యవస్థాపకత శాఖామాత్యులు ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ IAS., 
-ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహించిన పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్ష ఎస్పీడీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఢిల్లీ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక AI Conclave లో ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్‌ను గురువారం కేంద్ర విద్యా శాఖ, నైపుణ్య అభివృద్ధి, వ్యవస్థాపకత శాఖామాత్యులు ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కార్యదర్శి  సంజయ్ కుమార్ IAS., సందర్శించారు.
ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ్ రామరాజు. వి IAS., రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, విద్యార్థులకు అందుతున్న డిజిటల్ విద్య గురించి క్లుప్తంగా వివరించారు. సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు IAS., గారు క్షేత్రస్థాయిలో విద్యా ప్రగతిని వివరించారు. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వం విద్యా రంగంలో ప్రవేశపెట్టిన PAL ల్యాబ్స్ అమలు, మధ్యాహ్న భోజన పథకం, క్లిక్కర్, Guaranteed FLN, chatbot, AI Enabled Face recognition system తదితర వినూత్న మార్పులు, సాంకేతికత వినియోగాన్ని చూసి కేంద్ర మంత్రి అభినందించారు. పలు రాష్ట్రాల ప్రభుత్వ అధికారులు ఈ స్టాళ్లను సందర్శించి, ఏపీలో అమలవుతున్న విద్యా సంస్కరణలను, వాటిని AIతో అనుసంధానించిన విధానాన్ని ఆసక్తిగా పరిశీలించి సంతోషం వ్యక్తం చేసారు. త్వరలో ఏపీని సందర్శిస్తామని తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *