అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
టైలరింగ్‌లో రాజధాని ప్రాంత మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశానికి గతంలో టైలరింగ్ శిక్షణ పొందిన మహిళలు లేదా తమ గ్రామాల్లో టైలరింగ్‌పై ఆసక్తి కలిగి జాబ్ వర్క్/ ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న మహిళల కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ సమావేశానికి సెంట్రల్ బిజినెస్ పార్క్, మంగళగిరి నుండి సంబంధిత ప్రతినిధులు ప్రత్యేకంగా హాజరై, టైలరింగ్ ఉద్యోగాలు, జాబ్ వర్క్ అవకాశాలు, పని విధానం మరియు ఉపాధి కల్పనపై అవగాహన కల్పించనున్నారు.
సమావేశ వివరాలు:
తేదీ: 13-02-2026
సమయం: మధ్యాహ్నం 2:00 గంటలకు
వేదిక: తుళ్లూరు HSR కళ్యాణ మండపం
కావున రాజధాని పరిసర గ్రామాలలో టైలరింగ్ రంగంపై ఆసక్తి ఉన్న మహిళలందరూ ఈ సమావేశానికి హాజరై, తమకు లభించిన ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరడమైనది. ఈ సమాచారాన్ని ఇతరులకు కూడా తెలియజేసి, ఎక్కువ మంది మహిళలు పాల్గొనేలా సహకరించాలని కోరారు.
Prajavartha Online Telugu News