విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీశైలంలో ఉన్న ముదిరాజ్ అన్నదాన సత్రాన్ని పులివెందుల గంగాధర్ అనుచరులు కబ్జా చేశారని ముదిరాజ్ సంఘం ఆరోపించింది. ఈ విషయమై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు సంఘం అధ్యక్షుడు గుడాల వెంకటాచలం తెలిపారు. గురువారం ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముదిరాజ్ సత్రాన్ని ముదిరాజులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. సత్రం నిర్వహణలో భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు. పులివెందుల గంగాధర్ అనుచరులు సత్రం కబ్జా చేసి, భక్తుల డబ్బును దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పురారువ నిత్య అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కాశీబోయిన పూర్ణచంద్రరావు, ఉపాధ్యక్షులు గోడల వెంకటాచలం, కోశాధికారి కనుక్కోటి శ్రీనివాసులు, కమిటీ సభ్యులు మేకల చిన్నబ్బాయి, ఆర్ రామారావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News