Breaking News

గ్రామీణ మహిళలకు ఆర్థిక స్వావలంబన దిశగా నైపుణ్యాభివృద్ది శిక్షణ

-ఎన్.ఐ.ఆర్.డి లో హ్యాండ్ మేడ్ పేప‌ర్ ప్రొడ‌క్ట్స్ పై 4వ రోజు శిక్ష‌ణ‌
-స్క్రీన్ ప్రింటింగ్, ప‌ల్ప్ , షీట్ నిర్మాణం తయారీ లో శిక్షణ
-ప‌త్రిక‌ ప్రకటన విడుదల చేసిన ఎంపీ కేశినేని శివనాథ్, కేశినేని ఫౌండేషన్ కార్యాలయం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామీణ మహిళలు తమ జీవనోపాధి అవకాశాలను విస్తరించుకుని ఆర్థికంగా స్వాలంబ‌న సాధించే దిశ‌గా న‌డిపించేందుకు ఎంపీ కేశినేని శివ‌నాథ్ సార‌ధ్యంలో కేశినేని ఫౌండేష‌న్, ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ ఎన్.ఐ.ఆర్.డి ప్ర‌ధాన కార్యాల‌యంలో హ్యాండ్ మేడ్ పేప‌ర్ ప్రొడ‌క్ట్స్ త‌యారీపై అందిస్తున్న నైపుణ్యాభివృద్ది శిక్ష‌ణను ఎన్టీఆర్ జిల్లా కు చెందిన ఎస్.హెచ్.జి మ‌హిళ‌లు అందిపుచ్చుకుంటున్నారు.

ఫిబ్ర‌వ‌రి 9 వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరిగే ఈ శిక్షణా కార్యక్రమంలో నాల‌వ రోజు గురువారం ఎన్.ఐ.ఆర్.డిలో ఎస్.హెచ్.జి మహిళలు పొందిన శిక్షణ వివరాలను తెలియజేస్తూ ఎంపీ కేశినేని శివనాథ్, కేశినేని ఫౌండేషన్ కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది

ఎన్.ఐ.ఆర్.డి లో హ్యాండ్ మేడ్ పేపర్ ఉత్పత్తుల తయారీకి సంబంధించి గాంధీ హ్యాండ్ మేడ్ పేపర్ యూనిట్ అధికారి జె.రవీంద్రరావు నేతృత్వంలో పల్ప్ తయారీ, షీట్ నిర్మాణం, స్క్రీన్ ప్రింటింగ్, ఎన్వలప్ కవర్స్, పెన్స్ స్టాండ్ తయారీ పై అవగాహన శిక్షణ తరగతులు నిర్వహించారు. అనంతరం వీటిని ఎలా తయారు చేయాలో శిక్షణ ఇచ్చారు.. అలాగే స్క్రీన్ ప్రింటింగ్ యూనిట్ ను సంద‌ర్శించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *