– క్రికెట్ చూడ్డానికి సొంత డబ్బుతో వెళ్తే వైసీపీ నేతలకు నొప్పెందుకు?
– పేదల సొమ్ముతో జల్సాలు చేసిన జగన్ రెడ్డి కూడా మాట్లాడడం హాస్యాస్పదం
– పేర్ని నానిని బందరులో పిచ్చి కుక్కలు కూడా పట్టించుకోవు
– లోకేశ్, చంద్రబాబు గురించి అడ్డగోలుగా వాగితే ఉపేక్షించేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలు చిత్తుగా ఓడించినా, వారి అరాచకాలన్నీ చూసి ప్రజలు చీదరించుకుంటున్నా.. ఇంకా వైసీపీ నాయకులు బరితెగించి మాట్లాడుతున్నారు. బందరులో పిచ్చికుక్క కరిచిన పేర్ని నాని ఏం మాట్లాడుతున్నాడో అర్ధం కావడం లేదు. ఏదో ఒకటి వాగి సోషల్ మీడియాలో పెట్టి హడావుడి చేయడం తప్ప చేసిందేమీ లేదు. నారా లోకేశ్, నారా చంద్రబాబు గారి గురించి మాట్లాడే కనీస అర్హత కూడా పేర్ని నానికి లేదు. ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా భయపడి పారిపోయిన వ్యక్తి పేర్ని నాని. కొడుకుని నిలబెడితే 50 వేల భారీ తేడాతో ఓడించారు. బందరు ప్రజలు కాదు కదా.. బందరులోని పిచ్చి కుక్కలు కూడా పేర్ని నానిని పట్టించుకోవు.
నారా లోకేశ్ గారికి క్రికెట్ అంటే ఇష్టం. స్వయంగా చూడ్డానికి సొంత ఖర్చులతో వెళ్లారు. అందులో తప్పేంటి.? అదేమైనా మీలా గంట అరగంట, సుకన్య అనే లాంటి దిక్కుమాలిన కార్యక్రమాలు కావు కదా? క్రికెట్ బెట్టింగులు, పేకాట క్లబ్బులో కాదు కదా? బోర్డింగ్ పాసులు చూపించాలని అడగడానికి సిగ్గనిపించడం లేదా?
గూగుల్ సంస్థను దేశంలో ఎన్నో రాష్ట్రాలు పోటీ పడినా ఏపీకి తీసుకొచ్చిన వ్యక్తి నారా లోకేశ్. అలాంటి వ్యక్తి గురించి, అతని వ్యక్తిగత జీవితం గురించి విమర్శలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకునేది లేదు. తిరుపతి లడ్డూలో చేయాల్సిన ఘోరాలన్నీ చేశారు. మీరు పొర్లు దండాలు పెట్టినా గానీ కాలం నుండి తప్పించుకోవడం సాధ్యం కాదు.
పేదలకు చెందిన 8000 బస్తాల పేదల బియ్యాన్ని పందికొక్కులా బొక్కేసి, డబ్బులు కట్టేశాను కదా అని చెప్పిన నీకు లోకేశ్ గారి గురించి మాట్లాడే అర్హత ఉందా? గత ఐదేళ్లలో సుమారు రూ.250 కోట్ల ప్రజా సొమ్మును జగన్ రెడ్డి సొంత పర్యటనల కోసం వాడుకున్నట్లు ఆర్టీఐ ద్వారా తెప్పించిన సమాచారంలో ఉంది. వ్యక్తిగత పర్యటనల పేరుతో లండన్ పర్యటనలన్నీ ప్రజల సొమ్ముతోనే చేశారు. 2019-20లో రూ.31.43 కోట్లు, 2020-21లో రూ.43 కోట్లు, 2021-22లో రూ.49.45 కోట్లు, 2022-23లో రూ.47.18 కోట్లు, 2023-24లో రూ.50 కోట్లు మొత్తంగా రూ.222.85 కోట్లు విదేశీ పర్యటనల పేరుతో ఖర్చు చేశారు. ఫిక్సిడ్ వింగ్ విమాన సంస్థకు రూ.112.50 కోట్లు, హెలికాప్టర్ రైడ్లకు రూ.87.02 కోట్లు చొప్పున ఖర్చు చేశారు. తాడేపల్లి నుండి తెనాలి వెళ్లడానికి కూడా హెలికాప్టర్ వాడినోళ్లు.. ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు.
ప్రజా జీవితంలో ఉన్నవారు కాస్త ఇంగితంతో మాట్లాడాలి. ముఖ్యమంత్రి గారి గురించి కూడా ఏకవచనంతో (మీ బాబు) అంటూ మాట్లాడుతున్నాడు. మేము అలా మాట్లాడలేం అనుకుంటున్నారా? సొంత బాబాయిని అత్యంత కిరాతకంగా బాత్రూంలో హత్య చేసి, అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిందితులను కాపాడారు. ఇంతటి కౄరమైన జగన్ రెడ్డి.. బాబాయి హత్యను చంద్రబాబు గారిపైకి నెట్టే ప్రయత్నం చేశారు. ప్రజలు చీదరించుకుని 151 సీట్ల నుండి 11 సీట్లకు తొక్కి పెట్టినా ఇంకా బుద్ధి రాకుండా పోయింది.
68 లక్షల కిలోల కల్తీ నెయ్యిని వినియోగించి 20 కోట్లకు పైగా లడ్డూలు తయారు చేసి స్వామి వారి పవిత్రతను దెబ్బతీశారు. వారి తప్పుని తప్పించుకోవడానికి హెరిటేజ్‌పై విమర్శలు చేసి కోర్టులో మొట్టికాయలు తిన్నారు. గత ఐదేళ్లలో సాక్షి పత్రికకు యాడ్స్ రూపంలో రూ.200 కోట్లు దోచిపెట్టారు. సచివాలయాలకు సాక్షి పేపర్లు సరఫరా చేసి రూ.150 కోట్ల ప్రజాధనం దోచిపెట్టారు. సొంత కంపెనీలకు లీజులు కట్టబెట్టారు.
చంద్రబాబు గారు ఏ రోజు కూడా హెరిటేజ్‌తో ప్రభుత్వానికి ఎలాంటి ఒప్పందాలు చేసుకున్న దాఖలాలు లేవు. ఎంతో నిబద్దతతో, విలువలతో చంద్రబాబు గారు పని చేస్తున్నారు. చివరికి బిల్ గేట్స్ ఏపీకి రావడాన్ని కూడా విమర్శిస్తున్నారంటే ఈ వైసీపీ నాయకులకు బ్రెయిన్స్ ఉన్నాయో లేదో అర్ధం కావడం లేదు. పాతికేళ్ల క్రితం బిల్ గేట్స్ రాకతో హైదరాబాద్ ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో అంతా చూశాం. ఇప్పుడు గేట్స్ సంస్థ రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయంలో సహకారం అందించేందుకు ముందుకు వస్తే.. విమర్శలు చేస్తున్నారు.
ఐదేళ్ల పాలనలో దోపిడీలు, దుర్మార్గాలకు పాల్పడ్డారు. ఇప్పుడు అభివృద్ధి చేస్తుంటే.. చూసి ఓర్వ లేక కుట్రలు చేస్తున్నారు. కుల మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీకి రాకుండా గెలిపించిన ప్రజల్ని మోసం చేస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలి, ఎలా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తోంది. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని తపిస్తున్నాం. జగన్ రెడ్డికి వెంకటేశ్వర స్వామివారిపై నమ్మకం లేదు. అన్యమతస్తుడని ఒప్పుకున్నాడు. అలాంటి వ్యక్తికి వెంకటేశ్వర స్వామి వారి గురించి మాట్లాడే కనీస అర్హత లేదు. కౌన్సిల్‌లో కొందరు, బయట మరికొంత మంది పిచ్చి కుక్కలు మొరుగుతున్నాయి.
Prajavartha Online Telugu News