Breaking News

ప్రజారాజధాని అమరావతిలో పర్యటించిన నామి ఐలాండ్, సియోల్ జాతీయ యూనివర్సిటీ (దక్షిణ కొరియా) బృందం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు రాష్ట్రాలలో పర్యటిస్తున్న నామి ఐలాండ్, సియోల్ జాతీయ యూనివర్సిటీ(దక్షిణ కొరియా) బృందం సోమవారం ఫిబ్రవరి 23న ప్రజారాజధాని అమరావతిలో పర్యటించింది. పర్యటనలో భాగంగా రాయపూడిలోని APCRDA కార్యాలయాన్ని బృందం సందర్శించింది. ఈ సందర్భంగా అమరావతి అభివృద్ధి గురించి CRDA అధికారులు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అమరావతిలో ప్రణాళికాయుతంగా జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతి, రాజధాని నిర్మాణంలో అమలు చేస్తున్న సమగ్ర మౌలిక వసతుల ప్రణాళికలు, దీర్ఘకాలిక రాజధాని అభివృద్ధి వ్యూహాలు వంటి అంశాలను అధికారులు విదేశీ బృందానికి వివరించారు. అమరావతిలో పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి, టూరిజం ప్రాజెక్టులు, విద్య, పరిశోధన అంశాలలో భాగస్వామ్యాలకు ఉన్న విస్తృత అవకాశాలు, సుస్థిర పట్టణ ప్రణాళిక అంశాలపై అధికారులు దక్షిణ కొరియా బృందానికి వివరించారు.

అనంతరం APCRDA కమిషనర్ కె. కన్నబాబు, ఐ.ఏ.ఎస్. తో బృందం భేటీ అయ్యింది. రాజధాని అమరావతి ప్రాంత సాంస్కృతిక ప్రత్యేకతలను ప్రతిబింబించే వివిధ వస్తువులు కలిగిన గిఫ్ట్ బ్యాగ్‌ను కమిషనర్ బృందంలోని సభ్యులకు అందజేశారు. బృందంలోని సభ్యులతో అమరావతిలో పర్యాటక సదుపాయాల అభివృద్ధి తదితర అంశాల గురించి కమిషనర్ గారు చర్చించారు. స్థానిక సంస్కృతి, ఆవిష్కరణలు, పర్యాటక అభివృద్ధి, పెట్టుబడులకు అనుకూలమైన అభివృద్ధి చెందిన రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేందుకు ప్రపంచ స్థాయి భాగస్వామ్యాలను ప్రోత్సహించడంలో ముందుటామని APCRDA కమిషనర్ బృందానికి తెలిపారు.

క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా దక్షిణ కొరియా బృందం అమరావతిలోని పలు ప్రాంతాలను సందర్శించింది. సీడ్ యాక్సెస్ రహదారి, ట్రంక్ ఇన్‌ఫ్రా పనులు జరుగుతున్న ప్రాంతాలు, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో భాగంగా ఎంఎల్ఏ & ఎంఎల్సీలకు నిర్మించిన టవర్లు అలాగే జీఏడి, HOD టవర్ల నిర్మాణ పనులు జరుగుతున్న సైట్‌లను బృందంలోని సభ్యులు పరిశీలించారు. క్షేత్రస్థాయి పర్యటనతో అమరావతి ప్రాంత సాంస్కృతిక వారసత్వం, పర్యాటక అభివృద్ధి, సుస్థిరమైన విధానాలతో అభివృద్ధి చెందుతున్న రాజధాని నగర రూపురేఖలపై వారికి సమగ్ర అవగాహన లభించింది.

దక్షిణ కొరియా బృందంలోని సభ్యులు:
నామి ఐలాండ్ (విద్య & కళలు విభాగం) బృందంలోని సభ్యులు:
1. KYEONG WOO MIN / CEO
2. JINWOOK KWON / Senior Producer, Cultural Projects Department
3. CHIRAG SESHU JALADI / Producer, Cultural Projects Department
సియోల్ జాతీయ యూనివర్సిటీ(ఆసియా సెంటర్) బృందంలోని సభ్యులు:
4. SUNG YONG KANG / Director, Center for South Asian Studies
5. SEONGHO CHOI / Senior Researcher, Center for South Asian Studies

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *